ఫ్యామిలీతో చూసేలా ఉండే యాక్షన్ ఎంటర్ టైనర్ షేర్ : నందమూరి కళ్యాణ్ రామ్
- IndiaGlitz, [Wednesday,October 28 2015]
నందమూరి కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం షేర్. ఈ చిత్రాన్ని మల్లిఖార్జున్ తెరకెక్కించారు. విజయలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై కొమర వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన షేర్ మూవీని ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా షేర్ మూవీ గురించి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఇంటర్ వ్యూ మీకోసం...
షేర్ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
ఈ సినిమాలో నా క్యారెక్టర్ సిన్సియర్ గా ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి..ఫాదర్ కి హెల్ప్ చేస్తుంటాను. ఆలోచనా విధానం ఒకలా ఉంటుంది. చేసే పని వేరేలా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే...ఇతరులను డీల్ చేసే విధానం చాలా కొత్తగా ఉంటుంది.
షేర్ సినిమా కథ ఏమిటి..?
షేర్ కథ ఏమిటనేది చెప్పను కానీ...ఫ్యామిలీతో చూసేలా ఉండే యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది అని చెప్పగలను. డైరెక్టర్ మల్లి చాలా బాగా తీసాడు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా షేర్ ఉంటుంది. పూర్తి కథ ఏమిటనేది తెలుసుకోవాలంటే షేర్ ను తెరపై చూడాల్సిందే.
సక్సెస్ లో లేని మల్లిఖార్జున్ తో సినిమా చేయడానికి కారణం ..?
మల్లిఖార్జున్.. కెరీర్ బిగినింగ్ నుంచి నాతో ట్రావెల్ అయ్యాడు.మల్లిఖార్జున్ కి సక్సెస్ లేకపోయినా...అతనిలో ఉన్న టాలెంట్ పై నాకు నమ్మకం ఉంది. మల్లి.. నాతో తీసిన అభిమన్యు సినిమాను థియేటర్లో చూసాం. ఆడియోన్స్.. ఫస్టాఫ్ బాగుంది. ఇక సెకండాఫ్ యాక్షన్ ఇరగదీస్తాడని అనుకున్నారు. కానీ..మేము ఎక్కువ యాక్షన్ పెట్టలేదు. అక్కడ మిస్ అయ్యాం. ఈ సినిమా విషయానికి వస్తే..మల్లి చాలా కష్టపడ్డాడు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో ఈ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా మల్లి కోసం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
పటాస్ తర్వాత వస్తున్నసినిమా కదా...మరి ఇందులో కూడా ఎంటర్ టైన్మెంట్ ఎక్కువుగా ఉంటుందా..?
షేర్..పటాస్ తర్వాత రిలీజ్ అవుతున్నప్పటికీ..పటాస్ ముందే షేర్ స్టార్ట్ చేసాం. ప్లాష్ బ్యాక్ లేకుండా స్ట్రైయిట్ నేరేషన్ తో సాగే డిఫరెంట్ జోనర్ మూవీ ఇది. పటాస్ సినిమాలా భారీ డైలాగ్స్ ఉండవు కానీ.. ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది.
పటాస్ రిజల్ట్ తర్వాత షేర్ లో ఛేంజేస్ చేసారా..?
హీరోయిన్ మార్చాం. అలాగే ఎంటర్ టైన్మెంట్ పెంచాం. మెయిన్ కథ మాత్రం మార్చలేదు.(నవ్వుతు..)
హీరోయిన్ మార్చడానికి కారణం ఏమిటి..?
ఈ సినిమాలో హీరోయిన్ గా మాన్య మిశ్రా అనుకున్నాం. పది రోజులు షూటింగ్ కూడా చేసాం. కానీ ఎందుకనో..క్యారెక్టర్ కి ఆమె సెట్ కాలేదనిపించింది. ఆతర్వాత సోనాల్ చౌహన్ ని తీసుకున్నాం.
షేర్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి...?
ఈ సినిమాకి షేర్ టైటిల్ అని డైరెక్టర్ మల్లిఖార్జునే ఫిక్స్ చేసాడు. మా అందరి కంటే మల్లి బాగా కష్టపడ్డాడు. మల్లి చెప్పిన తర్వాత షేర్ టైటిల్ కరెక్టే అని మా అందరికి అనిపించింది. సినిమా చూసిన తర్వాత ఈ కథకి షేర్ టైటిలే కరెక్ట్ అని మీరే చెబుతారు.
ఈ సంవత్సరంలో పటాస్..షేర్..రెండు సినిమాలు చేసారు కదా..? ఇదే కంటిన్యూ చేస్తారా..?
కథ నచ్చాలి.. కథ నచ్చి అన్ని కుదిరితే రెండు సినిమాలే ఏమిటి ఇంకా ఎక్కువు సినిమాలు చేయాలనుకుంటాను. అయితే ఖచ్చితంగా సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాను.
షేర్ ఆడియో ఫంక్షన్ లో ఎమోషనల్ గా మాట్లాడారు..?
నాకు నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అందుచేత మా ఫ్యామిలీని ఎవరైనా ఏదైనా అంటే తట్టుకోలేను. అందుకనే ఎమోషన్ అయిపోయాను.
ఓం సినిమా ప్లాప్ అవ్వడంతో ఇక ప్రయోగాలు చేయకూడదనుకుంటున్నారా..?
మూడు సంవత్సరాలు కష్టపడి 3డి టెక్నాలజీతో ఓం సినిమా చేసాను. సినిమా రిలీజ్ తర్వాత ఓం డిజాస్టర్..ప్లాప్..ఇలాంటి మాటలు విని జీర్ణించుకోలేకపోయాను. ఇందులో ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ ఎక్కువుగా ఉండడం, అసలు ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం..నేను చేసిన తప్పు అందువల్లే ఓం ప్లాప్ అయ్యింది అనుకుంటున్నాను. సో...ఓం సినిమాలో చేసిన తప్పులు మళ్లీ చేయకుండా భవిష్యత్ లో ప్రయోగాలు చేస్తాను.
ఎన్టీఆర్ తో మీరు నిర్మించే సినిమా ఎప్పుడు..?
ఎన్టీఆర్ తో నిర్మించే సినిమా ప్రారంభోత్సవం చాలా గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నాను. అది ఎప్పుడు..? ఎక్కడ..? అనే పూర్తి వివరాలను త్వరలో తెలియచేస్తాను.