సిక్స్ ప్యాక్ లో కల్యాణ్ రామ్.....
Send us your feedback to audioarticles@vaarta.com
సిక్స్‌ప్యాక్ ట్రెండ్ టాలీవుడ్లో నడుస్తూనే ఉంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన హీరోలను మాస్ యాంగిల్లోనే కాకుండా లుక్ పరంగా కూడా కొత్తగా చూపించాలనుకుంటాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సిక్స్ ప్యాక్‌లో చూపించిన ఈ దర్శకుడు ఇప్పుడు ఎన్టీఆర్ ఆన్న కల్యాణ్‌రామ్‌ను కూడా సిక్స్ ప్యాక్‌లో చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని కల్యాణ్ రామ్ కూడా ఓ ఆంగ్లపత్రికతో చెప్పుకొచ్చాడు. ఇజం సినిమా ముందు నేను 86 కిలోలుండేవాడిని సినిమా కోసం జిమ్ చేయడం వల్ల దాదాపు పదకొండు కిలోలు తగ్గాను. మా అబ్బాయి శౌర్య రీసెంట్గా టీవీలో నా తొలి చిత్రం తొలి చూపులోనే సినిమా చూసి అదేంటి నువ్వు ఇప్పటి కంటే ఆ సినిమాలో లావుగా ఉన్నావు. ఇప్పుడే బావున్నావని కూడా అన్నాడని తెలియజేశాడు.
ఈ క్రెడిట్ అంతా తన దర్శకుడు పూరి జగన్నాథ్‌దే అన్నాడు కల్యాణ్‌రామ్. ఈ సినిమా ప్రారంభంలో పూరి, కల్యాణ్‌రామ్‌ను కలిసి నువ్వు చాలా ఫిట్‌గా ఉండాలి. లుక్ చాలా డిఫరెంట్‌గా ఉండాలి. నీలో మార్పును చూసి అందరూ షాక్ అవ్వాలని చెప్పాడట. వేసుకునే దుస్తులు నుండి హెయిర్ స్టైల్ ఇలా అన్నీ విషయాల్లో పూరిగారు చాలా క్లారిటీతో ఉన్నారు. నా పదమూడేళ్ల కెరీర్లో చేయని స్టైలిష్ క్యారెక్టర్ ఇజంలో చేస్తున్నానంటూ కల్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments