క‌లిసొచ్చిన సీజ‌న్‌లో క‌ళ్యాణ్ రామ్ డ‌బుల్ ధ‌మాకా

  • IndiaGlitz, [Monday,February 26 2018]

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన మొద‌టి సినిమా 'తొలిచూపులోనే' (2003) అయిన‌ప్ప‌టికీ.. గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం 'అతనొక్కడే'(2005). ఈ చిత్రంతో సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. వేసవి కానుకగా (మే 12న) విడుదలైన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఘన విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాతో నిర్మాతగా కూడా తన సత్తాను చాటుకున్నారు ఈ యంగ్ హీరో.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటించిన 'ఎం.ఎల్.ఎ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంతో ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. త‌న తొలి హిట్ చిత్రం 'అతనొక్కడే' కి సంగీతమందించిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రం వేసవి కానుకగా (మార్చి 23న) విడుదల కానుంది.

అంతేగాకుండా.. వేసవినే టార్గెట్ చేస్తూ కళ్యాణ్ రామ్ నటించిన మరో చిత్రం 'నా నువ్వే' కూడా విడుదలకు సిద్ధం కానుంది. జయేంద్ర తెర‌కెక్కిస్తున్న ఈ మ్యాజికల్ లవ్ స్టొరీలో తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో మొదటి హిట్ ను, ఘన విజయాన్ని అందించిన వేసవి.. ఈ రెండు చిత్రాలకు కూడా క‌లిసొస్తుందేమో చూడాలి.

More News

మ‌రోసారి గృహిణి పాత్ర‌లో శ్రియ‌?

టాలీవుడ్‌లో..  ప్ర‌స్తుతం న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న ఓ గృహిణి పాత్ర‌కు ఆర్టిస్ట్ కావాలంటే  అంద‌రి ద‌ర్శ‌కుల చూపు శ్రియ పైనే. ఆ పాత్ర‌ల్లో ఆమె అంత‌లా ఒదిగిపోతుంద‌న్న‌ది వారి న‌మ్మ‌కం. గ‌తంలో వ‌చ్చిన 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి', ఇటీవ‌ల విడుద‌లైన 'గాయ‌త్రి' సినిమాల‌తో అది నిరూపితమైంది కూడా.

ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న స‌మంత‌

తొలి చిత్రం 'ఏ మాయ చేశావే' కోసం జెస్సీగా క‌నిపించి.. కుర్రకారు మనసుల‌ని తన అందం, అభిన‌యంతో దోచుకున్నారు చెన్నై బ్యూటీ సమంత.

'కణం' మొదటి సింగిల్‌ 'సంజాలి'

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కణం'. ఈ చిత్రం మొదటి సింగిల్‌ 'సంజాలి..'ను ఆదివారం విడుదల చేశారు.

'మా' అధ్యక్షుడు శివాజీ రాజా పుట్టినరోజు వేడుకలు

'మా' అధ్యక్షుడు శివాజీ రాజా పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఉదయం 'మా' కార్యాలయంలో నిడారంబరంగా జరిగాయి.

ఒక గొప్ప స్టార్ ను కోల్పోయాము : డా. కే.ఎల్. నారాయణ

శ్రీదేవి లాంటి గొప్ప స్టార్ తో 'క్షణక్షణం'చిత్రాన్ని నిర్మించడం ఆనందంగానూ,గర్వాంగానూ ఉండేదని,అయితే ఆమె హఠాత్తుగా మృతి చెందడం భారతీయ సినిమా రంగానికే తీరని లోటని నిర్మాత డా.కే.ఎల్.నారాయణ చెప్పారు.