కలిసొచ్చిన సీజన్లో కళ్యాణ్ రామ్ డబుల్ ధమాకా
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన మొదటి సినిమా 'తొలిచూపులోనే' (2003) అయినప్పటికీ.. గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం 'అతనొక్కడే'(2005). ఈ చిత్రంతో సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. వేసవి కానుకగా (మే 12న) విడుదలైన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఘన విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాతో నిర్మాతగా కూడా తన సత్తాను చాటుకున్నారు ఈ యంగ్ హీరో.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటించిన 'ఎం.ఎల్.ఎ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంతో ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. తన తొలి హిట్ చిత్రం 'అతనొక్కడే' కి సంగీతమందించిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రం వేసవి కానుకగా (మార్చి 23న) విడుదల కానుంది.
అంతేగాకుండా.. వేసవినే టార్గెట్ చేస్తూ కళ్యాణ్ రామ్ నటించిన మరో చిత్రం 'నా నువ్వే' కూడా విడుదలకు సిద్ధం కానుంది. జయేంద్ర తెరకెక్కిస్తున్న ఈ మ్యాజికల్ లవ్ స్టొరీలో తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో మొదటి హిట్ ను, ఘన విజయాన్ని అందించిన వేసవి.. ఈ రెండు చిత్రాలకు కూడా కలిసొస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com