క‌ళ్యాణ్ రామ్ - పూరి సినిమా ప్రారంభం..

  • IndiaGlitz, [Friday,April 29 2016]

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్స‌వంకు నంద‌మూరి హ‌రికృష్ణ‌, నంద‌మూరి రామ‌కృష్ణ‌, ఎన్టీఆర్, కొర‌టాల శివ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...త‌న సినిమా ప్రారంభోత్స‌వంకు విచ్చేసి శుభాకాంక్ష‌లు తెలియ‌చేసిన నాన్న హ‌రికృష్ణ‌, బాబాయ్ రామ‌కృష్ణ‌, ఎన్టీఆర్, కొర‌టాల శివ కు థ్యాంక్స్ తెలియ‌చేసారు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తున్నారు. మే నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.