Tamil »
Interviews »
నన్ను కొత్తగా చూపించనట్టే పూరి గార్ని కూడా కొత్త ఆవిష్కరించే విభిన్న కథా చిత్రం ఇజం - కళ్యాణ్ రామ్
నన్ను కొత్తగా చూపించనట్టే పూరి గార్ని కూడా కొత్త ఆవిష్కరించే విభిన్న కథా చిత్రం ఇజం - కళ్యాణ్ రామ్
Thursday, October 20, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అతనొక్కడే, లక్ష్మికళ్యాణం, హరేరామ్, ఓం, పటాస్...ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటించిన యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్. తాజాగా
కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ఇజం. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇజం చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించారు. కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా నటించిన భారీ యాక్షన్ ఎంటర్ ఇజం చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ఇజం చిత్రం గురించి నందమూరి కళ్యాణ్ రామ్ తో ఇంటర్ వ్యూ మీకోసం...!
ఇజం అంటే పూరిఇజమా..? కళ్యాణ్ రామ్ ఇజమా..?
ఇజం అంటే ఒక ఐడియాలజీ, ఫిలాసఫీ ఉన్న పర్సన్. ప్రతి మనిషికి ఇక ఇజం ఉంటుంది. ఈ చిత్రంలో నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటించాను. జర్నలిజం నుంచి ఇతనిది ఓ కొత్త ఇజం ఉంటుంది. మీరు అడిగిన దానికి చెప్పాలంటే...ఈ కథ పూరి గారు రాసారు కాబట్టి పూరి ఇజం అవుతుంది.
పూరి సినిమాల్లో హీరో రెబల్ గా ఉంటాడు. మరి ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
ఈ సినిమాలో ఓ సీన్ లో హీరో రెబల్ లా బిహేవ్ చేస్తాడు. అలాగని దానికి రెబల్ అని చెప్పలేం. ఈ సినిమా ఎండింగ్ చాలా కొత్తగా ఉంటుంది.
ఇది కొత్త కధతో తీసిన సినిమా అనను. కానీ..ఎండింగ్ అనేది మాత్రం కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏ సినిమాలో ఇలాంటి ముగింపు రాలేదు అని ఖచ్చితంగా చెప్పగలను.
మీ కెరీర్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకువెళ్లే సినిమా అనుకోవచ్చా..?
100%. అందులో ఎలాంటి సందేహం లేదు. పూరి గారు ఆర్టిస్టుగా నాకు ఈ సినిమాతో ఒక గ్రేట్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇజం టీజర్ బయటకు వచ్చినప్పటి నుంచే కళ్యాణ్ ఇలా మారిపోయాడు ఏమిటి అని చాలా మంది అడిగారు. ఇక సినిమాలో నన్ను చూస్తే షాక్ అవుతారు. టీజర్ లో మేము చూపించింది చాలా తక్కువ.
ఇజం పోస్టర్స్ లో మాస్క్ కనిపిస్తుంటుంది. ప్రత్యేక కారణం ఏమైనా ఉంటుందా..?
సినిమాలో మాస్క్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమా కోసం పూరి గారు చాలా రిసర్చ్ చేసారు. హాలీవుడ్ లో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో మాస్క్ మేము వాడాం అనుకుంటారు. ఈ మాస్క్ కు ఓ చరిత్ర ఉంది. ఈ మాస్క్ విక్టరీని చూపిస్తుంది. అలాగే హీరో ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్ట్ కాబట్టి అతను ఎవరు అనేది తెలియకూడదు అని ఆ మాస్క్ పెట్టుకుంటుంటాడు.
జర్నలిస్ట్ కి స్టైల్ & సిక్స్ ప్యాక్ అవసరం అంటారా..?
నాకు కథ చెప్పినప్పుడు పూరి గారు ఏం చెప్పారు అంటే ఫిజికల్ ఫిట్ నెస్ ఉండాలి అని చెప్పారు. పిజికల్ గా ఫిట్ గా ఉంటే మెంటల్ గా చాలా
స్ట్రాంగ్ గా ఉంటారు. డిసిప్లైన్ లైఫ్ ఉండాలి. ఈ క్యారెక్టర్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉండే క్యారెక్టర్. ఫిజికల్ గా ఫిట్ గా ఉంటే మన లుక్, బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అందుకనే క్యారెక్టర్ కి తగ్గట్టుగా స్ట్రాంగ్ గా ఉండాలనే సిక్స్ ప్యాక్ చేసాను.
బాడీలాంగ్వేజ్ ఛేంజ్ చేయడం కోసం మీరు హోమ్ వర్క్ ఏమైనా చేసారా..?
నేను ఏం చేయలేదండి. పూరి సార్ ఏం చెబితే అదే చేసాను. ఆయనకు ఏం కావాలో క్లియర్ గా తెలుసు. ఈ క్యారెక్టర్ కి ఏం కావాలి, ఎలా బిహేవ్ చేయాలి. డిక్షన్ ఎలా ఉంటుంది ఆయన రాసుకున్నప్పుడే అన్నీ రాసుకుంటారు. ఆయన చెప్పడం.. నేను చేయడం అంతే..!
డైలాగ్స్ ఎలా ఉంటాయి..? సాంగ్ లో లుచ్చాలు...అని వాడారు కదా..?
సంఘంలో దొంగతనాలు దోపిడీలు జరుగుతున్నాయి అని జర్నలిస్ట్ లే రాస్తున్నారు కదా..! అటువంటి వాళ్లు సమాజంలో ఉన్నారు కదా.
అయినా...అందర్నీ అనలేదు. నిజంగా చెప్పాలంటే ఈరోజు సోసైటీలో వాళ్లే ఎక్కువుగా ఉన్నారు. మంచోడికి విలువ ఎక్కడుంది.
మీరు పాజిటివ్ గా ఉండే జర్నలిస్టా..?
అవునండి..! పాజిటివ్ గా ఉండే జర్నలిస్ట్. సినిమాలో నెగిటివ్ అనేది ఎక్కడా కనిపించదు. ఎవర్ని కామెంట్ చేయడం లేదు. విమర్శించడం లేదు. లేడీస్ పై సెటైర్ లు ఉండవు. హీరోయిన్ కదా అని గిల్లడం జోక్ వేయడం అలాంటివి ఉండవు. ఈ సినిమాలో నేను ఎలాగైతే కొత్తగా కనిపిస్తానో..పూరి గార్ని కూడా కొత్తగా చూస్తారు. ఒక మాట చెప్పాలని ఉంది అది పూరి గారితో చెప్పాను రిలీజ్ తర్వాత చెబుతాను.
ఎన్టీఆర్ ఆర్ట్స్ సినిమా అంటే క్వాలిటీ ఉండాలి అనుకుంటారు పూరి చాలా ఫాస్ట్ గా సినిమా తీసేస్తారు. మరి..మీరనుకున్న క్వాలిటీ వచ్చింది అనుకుంటున్నారా..?
ఆయన స్పీడులోనే వెళుతు మేము అనుకున్న క్వాలిటీ ఇచ్చారు. ఇంత స్పీడులో కూడా క్వాలిటీ ఇవ్వగలుగుతున్నారు అంటే అది ఆయన గొప్పతనం. ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రొడ్యూసర్ గా సినిమాలు తీసారు కాబట్టి పూరి గారికి అంతా తెలుసు.
పటాస్ లో మీరు ఎంటర్ టైన్మెంట్ చేసారు ఆడియోన్స్ ఆదరించారు. ఆరేంజ్ ఎంటర్ టైన్మెంట్ ఇందులో ఉంటుందా..?
పటాస్ అనగానే పీపుల్ ఎంటర్ టైన్మెంట్ ఫిల్మ్ అని ఫిక్స్ అయ్యారు. ఇజం అనే టైటిల్ వినగానే సమ్ థింగ్ ఏదో ఉంది అనుకుంటారు. టైటిల్ లో డెప్త్ ఉంది. ఈ టైటిల్ వినగానే పటాస్ లా ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది అని ఎవరూ అనుకోరు. నన్ను రెండు మూడు మెట్లు పైకి తీసుకువెళ్లే సినిమా ఇది.
హీరోయిన్ ఆదితి ఆర్య క్యారెక్టర్ ఎలా ఉంటుంది...
ఈ సినిమా ద్వారా ఆదితి ఆర్యను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం. ఫస్టాఫ్ సినిమా నైస్ లవ్ స్టోరీ. పూరి గారి స్టైల్ ఉండే హీరో క్యారెక్టరైజేషన్ తో సరదాగా వెళుతుంటుంది. ఇంటర్వెల్ లో సినిమా ఏమిటి అనేది చూపిస్తాం. హీరోయిన్ క్యారెక్టర్ సెకండాఫ్ కూడా వెళుతుంటుంది. లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుంది. హీరో ఫ్యామిలీని కూడా త్యాగం చేస్తాడు. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. లవ్ స్టోరీతోనే ఎండ్ అవుతుంది సినిమా.
ఈ మూవీకి మ్యూజిక్ ఎంత వరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు..?
ఈ సినిమాకి మ్యూజిక్ ప్లస్ అవుతుంది. అనూప్ మంచి ట్యూన్స్ అందించాడు. ఒక టీజింగ్ సాంగ్ తప్పితే ప్రతి సాంగ్ సిట్యువేషన్ సాంగే. ప్రతి పాటలో కథ ఉంటుంది.
ఈ సినిమా కథ ఎప్పుడో రాసుకున్నాను ఎవరికి సెట్ అవుతుందో అనుకున్నాను కళ్యాణ్ రామ్ కి కరెక్ట్ గా సరిపోయింది అని పూరి అన్నారు మీరు ఎలా ఫీలవుతున్నారు..?
చాలా గర్వంగా ఉంది. ఆయన 31వ సినిమా ఇది. ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసారు. ఆయన ఇలా కామెంట్ చేసారంటే ప్రౌడ్ ఫీలింగ్. ఆయన్ని కలిసిన నెల తర్వాత ఈ స్ర్కిప్ట్ చెప్పారు. ఏ డైరెక్టర్ నా మీద ఇంత పెద్ద స్ర్కిప్ట్ ఆలోచించలేదు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అంటే..
ఆయన మాట్లాడేది చాలా హానెస్ట్ గా మాట్లాడతారు లేకపోతే ఎవరితో మాట్లాడరు. చాలా సిన్సియర్ గా మాట్లాడతారు. హోమ్ వర్క్ చేయమంటారా అని అడిగాను ఏం చేయద్దు మీరు ఎలా ఉంటారో అలా ఉండండి అన్నారు.
ఈ సినిమాలో నటకు గాను మీకు బెస్ట్ ఏక్టర్ అవార్డ్ వస్తుందని పూరి అన్నారు. మీరేమంటారు..?
న్యూ కళ్యాణ్ రామ్ ని కనిపెట్టింది ఆయనే కనుక.... అవార్డ్ వస్తే ఆయనకే అంకింతం ఇస్తాను.
ఈ మూవీలో కోర్టు సీన్ చాలా బాగా చేసారని టాక్ ఉంది. అసలు ఏమిటా సీన్..?
ఎనిమిది పేజీల సీన్ అది. హీరో ఒక్కడే మాట్లాడతుంటాడు ఏ డైలాగులు ఉండవు. నాకు భయం వేసింది. నా సినిమా జీవితంలో ఎనిమిది పేజీల డైలాగ్ చెప్పేసాను. నేను సినిమాలో చాలా తక్కువ మాట్లాడతాను. అలాంటిది డైలాగులు మొత్ం ఒక సీన్ లో పెట్టేసారు. నాకంటే నామీద ఆయనకే నమ్మకం ఎక్కువ నేను బాగా పర్ ఫార్మ్ చేస్తాను అని. ఇలాంటి స్ర్కిప్ట్ రావడం నా అదృష్టం.
జగపతిబాబు క్యారెక్టర్ ఎలా ఉంటుంది..?
అదితి ఆర్య ఫాదర్ రోల్ చేసారు. విలన్ తో కూర్చొని డైలాగ్స్ వార్నింగ్ లు ఏమీ ఉండవు. కాకపోతే ఆయన క్యారెక్టర్ చాలా డిపరెంట్ గా ఉంటుంది. ఆయన రోల్ కీలకం. ఆలీతో నైస్ కామెడీ ఉంటుంది. ఫస్టాఫ్ అంతా నాతో పాటు వెన్నెల కిషోర్ ఉంటారు. తనికెళ్ల భరణిగారు నా తండ్రి పాత్ర పోషించారు.
సాయిధరమ్ తేజ్ తో సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా స్ర్కిప్ట్ ఫైనల్ కాలేదు. అంతా పూర్తయిన తర్వాత చెబుతాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?
కథలు వింటున్నాను ఇంకా ఏది ఫైనలేజ్ చేయలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments