సరిగ్గా ఏడాదికి..
Send us your feedback to audioarticles@vaarta.com
'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్.. వేడుక చూద్దాం' సినిమాలతో వరుసగా రెండు హిట్లను అందుకున్న దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల. తన తాజా చిత్రం 'నేల టిక్కెట్టు'తో ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
విశేషమేమిటంటే.. తన రెండవ చిత్రం 'రారండోయ్.. వేడుక చూద్దాం' గత ఏడాది మే 26న ప్రేక్షకుల ముందుకు రాగా.. సరిగ్గా 365వ రోజున.. అంటే మే 25న తను డైరెక్ట్ చేసిన 'నేల టిక్కెట్టు' విడుదల కానుంది. ఈ నేపథ్యంలో..ఇప్పటికే రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఈ దర్శకుడు.. ఈ సినిమాతో హ్యాట్రిక్ని అందుకుంటారో లేదో చూడాలి.
కాగా.. మాస్ మహారాజా రవితేజ, ఉత్తారాది భామ మాళవికా శర్మ నాయకానాయికలుగా నటించిన 'నేల టిక్కెట్టు' చిత్రాన్ని ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఇందులో జగపతి బాబు ప్రతినాయక పాత్రలో కనిపించనుండగా.. బ్రహ్మానందం, అలీ, పోసాని, సురేఖా వాణి ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి 'ఫిదా' ఫేమ్ శక్తికాంత్ కార్తీక్ స్వరాలను సమకూర్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments