క‌ళ్యాణ్ దేవ్ 'కిన్నెర‌సాని' టైటిట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Saturday,November 14 2020]

హ్యాపెనింగ్ యంగ్ హీరో క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ(అశ్వ‌ధామ ఫేమ్) కాంబినేష‌న్ లో ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో ఎస్. ఆర్. టి ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 6కి పూజా కార్య‌క్ర‌మాల‌తో ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించారు. కిన్నెర‌‌సాని అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. కిన్నెర‌‌సాని టైటిల్ ని ప్ర‌క‌టించ‌డంతో పాటు టైటిల్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. కంటెంట్ కి పెద్ద పీఠ‌ వేస్తూ, నిర్మాణ విలువ‌ల్లో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాలు నిర్మిస్తున్న ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ వారు మ‌రో నిర్మాణ సంస్థ‌ శుభ‌మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ తో క‌లిసి కిన్నెర‌సాని చిత్రాన్ని సైతం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

కిన్నెర‌‌సాని టైటిల్ లుక్ పోస్ట‌ర్ లో సైతం సినిమా క‌థాంశం ప్ర‌తిభింబిచేలా ప్ర‌శాంత‌మైన స‌ముద్రపు ఒడ్డు, యాట్, గొలుసులు, తాళం వంటి ఎలిమెంట్స్ జోడించి డిజైన్ చేయ‌డం జ‌రిగింది. అలానే కిన్నేర‌సాని టైటిల్ కి క్యాప్ష‌న్ గా అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌య‌త్ (హ‌ద్దు లేక‌పోవ‌డం ప్ర‌మాద‌క‌రం) అనే సంస్కృత పదాన్ని కూడా జోడించారు. ఈ సినిమా సాయిరిషిక స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల ఈ సినిమాకు నిర్మాత‌లుగా రూపొందుతుంది. విజేత వంటి క్లాసిక్ హిట్ అందుక‌ని ప్ర‌స్తుతం సూప‌ర్ మచ్చి అనే క‌మ‌ర్షీయ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ లో న‌టిస్తున్న క‌ళ్యాణ్ దేవ్ నుంచి మూడో సినిమాగా ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ కిన్నెర‌‌సాని రాబోతుంది. ఈ చిత్రానికి దేశరాజ్ సాయితేజ క‌థ, క‌థ‌నం అందిస్తున్నారు. గ‌తంలో సాయితేజ్ క‌ల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించ‌డం విశేషం. అలానే ఛ‌లో, భిష్మ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కి సంబంధించిన‌ కార్య‌క్ర‌మాలు త్వ‌ర‌లోనే పూర్తి చేసుకొని సెట్స్ మీద‌కు సినిమాను తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత రామ్ త‌ళ్లూరి తెలిపారు.

More News

‘ఆహా’ గ్రాండ్ రివీల్ ఈవెంట్‌

డిఫరెంట్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను చూర‌గొన్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.

తెలంగాణలో గవర్నర్ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

బాణసంచా వ్యాపారులకు సుప్రీం ఊరట..

తెలంగాణ బాణసంచాపై నిషేధం ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పును మారుస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

నాగ శౌర్య , రీతువర్మ ల ‘వరుడు కావలెను‘

వినగానే ఇది తమ అమ్మాయికి తగిన ‘వరుడు‘ కోసం ‘వధువు‘ తల్లి దండ్రులు పత్రికలలో  ఇచ్చే ప్రకటన అనిపిస్తుంది. కానీ ఇది ఒక చిత్రం పేరు. మీరు వింటున్నది నిజమే....

అంత డబ్బులు పెట్టి కొంటే తినాలో తినకూడదో తెలియదు: పూరీ జగన్నాథ్‌

'ఒక కిలో దాదాపు నలబై లక్షలు ఖర్చు పెట్టి చేప గుడ్లని కొంటే తినాలో తినకూడదో అర్థం కాదు' అని అంటున్నారు స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌.