నవతరం 'విజేత' కళ్యాణ్ దేవ్

  • IndiaGlitz, [Saturday,May 26 2018]

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి విజేత అనే టైటీల్ ను ఫైనల్ చేశారు. కళ్యాణ్ దేవ్ సరసన ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఇవాళ విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. చిరంజీవిగారి అల్లుడైన కళ్యాణ్ దేవ్ పరిచయ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి చిరంజీవి గారి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన విజేత టైటిల్ ను ఆయన అల్లుడు హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి పెట్టడం సంతోషంగా ఉంది. కథకు బాగా యాప్ట్ అవుతుంది. బాహుబలి చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది. త్వరలోనే టీజర్ ను విడుదల చేసి, జూలైలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: జాషువా, కళ: రామకృష్ణ, సాహిత్యం: రెహమాన్, సంగీతం: యోగేష్, ఛాయాగ్రహణం: కెకె.సెంథిల్ కుమార్, సమర్పణ: సాయి శివాని, నిర్మాణం: సాయి కొర్రపాటి, నిర్మాత: రజని కొర్రపాటి, కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: రాకేష్ శశి.

More News

'యంగ్ స్టార్స్' ప్రారంభం

ఆదిత్య ఓం ,స్వాతి టండన్ జంటగా హరిచందన్ దర్శకత్వంలో తెరకెక్కుతొన్న త్రిభాషా చిత్రం "యంగ్ స్టార్స్".

'సాక్ష్యం' పోస్ట్ పోన్ అవుతుందా?

బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాక్ష్యం".

మ‌హేశ్ సినిమాల‌ను ఫాలో అవుతానంటున్నవిదేశీ క్రికెట‌ర్‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ సినిమాల‌ను స్టార్ విదేశీ క్రికెట‌ర్  ర‌షీద్ ఖాన్ ఫాలో అవుతుంటాడ‌ట‌.

జూన్‌ 29న సాయిధరమ్‌తేజ్ 'తేజ్‌ ఐ లవ్‌ యు'

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకం పై ఎ.కరుణాకరన్‌

ఛాలెంజ్‌ను పూర్తి చేసిన సమంత‌...

హ‌మ్ ఫిట్‌తో ఇండియా ఫిట్ హై అనే ఛాలెంజ్‌ను కేంద్ర క్రీడ‌ల మంత్రి రాజ్య‌వ‌ర్ద‌న్ సింగ్ రాథోడ్ స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.