Kalpika Ganesh : నీ పవర్ చూపించావ్.. నేనేంటో చూపిస్తే భస్మమైపోతార్ : ధన్య బాలకృష్ణకు కల్పిక వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ నటి ధన్య బాలకృష్ణ- కల్పికా గణేష్ మధ్య వివాదం ముదురుతోంది. ఇటీవల ధన్య రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ కల్పిక బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. దీంతో సినీ పరిశ్రమ, ధన్య అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత మరోసారి కల్పిక సంచలన వ్యాఖ్యలు చేశారు. ధన్య తనని వివాదానికి ఆహ్వానిస్తోందని... త్వరలో కోర్టులో కలుసుకుందామని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు తనను బ్లాక్ మెయిల్ చేసిన నువ్వు.. నీ గురించి ఎన్నో విషయాలు బయటపెట్టే సరికి భయపడ్డవా అంటూ కల్పిక అన్నారు. ఎందుకు అన్ని కాల్స్ చేశావు.. నీతో కూర్చొని మాట్లాడటానికి నేను సిద్ధమని ఆమె ప్రకటించారు. నీ పవర్ చూపించి నా వీడియోను యూట్యూబ్‌లో లేకుండా చేశావు.. నా పవర్ చూపిస్తే భస్మమైపోతారంటూ కల్పిక ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ నుంచి నాకు క్షమాపణలు వద్దు.. అవకాశాలు కూడా ఇవ్వొద్దు. అనుకోకుండానే నేనే నటిగా మారా... ఇది కాకపోతే ఇంకో పనిచేసుకుంటానని ఆమె తేల్చిచెప్పారు.
ఇప్పుడే నీ పెళ్లి గురించి ఎందుకు చెప్పానంటే :
ఇకపోతే.. ఇటీవల కల్పికా గణేష్ (Kalpika Ganesh) తన యూట్యూబ్ ఛానెల్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లయి, విడాకులైన డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna) వివాహం చేసుకుందంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు. అయితే కాపీ రైట్ ఇష్యూ కారణంగా యూట్యూబ్ ఈ వీడియోను డిలీట్ చేసింది. తమిళ సినిమాలు చేస్తున్న సమయంలో ధన్యకు బాలాజీతో పరిచయం అయ్యిందని, ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఈ ఏడాది జనవరిలో వీరిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారని కల్పికం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తనకు ఎప్పుడో తెలిసినా.. ఇప్పుడే బయట పెట్టడానికి కారణం వుందన్నారు. ఇటీవల ధన్య మూవీ ప్రమోషన్స్‌కు రావడం లేదని.. బాలాజీ ఒకవేళ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడేమోనన్న అనుమానంతోనే ఈ విషయం చెప్పాల్సి వచ్చిందని కల్పిక అన్నారు.
యూట్యూబ్‌తో అభిమానులకు దగ్గరైన కల్పికా గణేష్ (Kalpika Ganesh):
ఇదిలావుండగా .. ప్రయాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కల్పికా గణేశ్. ఆ తర్వాత ఆరెంజ్, జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, హిట్ సిరీస్, యశోదా వంటి బ్లాక్ బస్టర్స్‌లో నటించారు. ఎక్కువగా హీరోయిన్ ఫ్రెండ్, ఇతర సహాయక పాత్రల్లో నటించిన కల్పిక.. ఇటీవలి కాలంలో యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments