వందేమాతరం శ్రీనివాస్ కు 'కాళోజి' పురస్కారం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా, ప్రజా గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కు కాళోజి పురస్కారం ఇవ్వనున్నట్లు తెలుగు టెలివిషన్ రచయితల సంఘం అధ్యక్షులు డి .సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భముగా డి .సురేష్ కుమార్ మాట్లాడుతూ - ''గత 5 ఏళ్లుగా ప్రజా కవి కాళోజి నారాయణ రావు గారి జన్మదిన సందర్భంగా ఆయన పేరుమీద 'కాళోజి' పురస్కారం తెలుగు సినిమా పరిశ్రమ లోని ప్రముఖ రచయితలకు ఇస్తూవచ్చాము. ఈ ఏడాది ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయినా వందేమాతరం శ్రీనివాస్ కు ఈ అవార్డు ఇవ్వడానికి సంతోషంగా తెలియచేస్తున్నాను. 2016 లో రచయిత చంద్ర బోస్ కి కాళోజి అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది. వారం లో జరగబోయే ఈ ప్రదానోత్సవంలో ఒకే వేదిక పై చంద్ర బోస్, వందేమాతరం శ్రీనివాస్ లను సన్మానించడం జరుగుతుంది." తెలంగాణ టివి డెవలప్మెంట్ ఫోరమ్, భారత్ కల్చరల్ అకాడమీ మరియు తెలుగు టివి రచయితల సంఘం ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com