త‌మిళంలోకి క‌ల్కి కొచ్లిన్‌

  • IndiaGlitz, [Tuesday,April 09 2019]

బాలీవుడ్ చిత్రం 'పింక్‌' త‌మిళ రీమేక్ 'నేర్కొండ పార్వై'. హిందీలో అమితాబ్ చేసిన పాత్ర‌ను తమిళంలో అజిత్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాల‌న్ అజిత్ స‌ర‌స‌న అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఇప్పుడు మ‌రో బాలీవుడ్ హీరోయిన్ క‌ల్కి కొచ్లిన్ కూడా ఈ సినిమాలో జాయినైంద‌ని స‌మాచారం. పాండిచ్చేరిలో పుట్టి పెరిగిన క‌ల్కికి త‌మిళం బాగా వ‌చ్చు. ఈమెను ద‌ర్శ‌క నిర్మాత‌లు సంప్ర‌దించ‌గా.. ఆమె ఏమాత్రం ఆలోచించ‌కుండా ఓకే చెప్పేశారు.

ఈ సినిమాలో కల్కి ఓ ర్యాప్ సాంగ్‌లో క‌న‌ప‌డుతున్నార‌ని విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. శ్రద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టాచ‌లం, ఆండ్రియా త‌రింగ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. ఆగ‌స్ట్ న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఖాకి ఫేమ్ హెచ్‌.వినోద్ ద‌ర్శ‌కుడు.