నిర్మాత డేట్‌కు రమ్మన్నాడు.. కుదరని చెప్పడంతో.!

  • IndiaGlitz, [Tuesday,December 24 2019]

‘మీ టూ’ ఉద్యమం సినీ రంగంలో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులపై పెద్ద ఎత్తున చర్చ జరిగి.. సినీ ప్రముఖుల చీకటి బాగోతాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఈ లైంగిక వేధింపుల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్... తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు వెల్లడించింది. ఓ నిర్మాత తనను డేట్‌కు రమ్మన్న విషయాన్ని తెలిపింది. దానికి ఒప్పుకోకపోయేసరికి సినిమా నుంచి తనను తీసేసినట్టు చెప్పుకొచ్చింది. హాలీవుడ్‌లోనూ ఈ జాడ్యం ఉందన్న ఆమె.. తనకు ఎదురైన చేదు ఘటనను కూడా తెలిపింది. క్యాస్టింగ్ ఏజెంట్ ఒకరు.. తన ముఖం చూసి కళ్ల కింద వలయాలపై మాట్లాడి.. పక్కకు పెట్టేశారని తెలిపింది. ఇక ‘దేవ్ డి’ సినిమాలో వేశ్యగా నటించిన తనను రష్యన్ వేశ్య అంటూ కామెంట్ చేశారని చెప్పింది. చివరికి తాను రష్యన్ కాదని చెప్పుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె నటించిన ‘యే జవానీ.. హై దివానీ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కల్కి నటించింది. ఈ సినిమా 2013లో రిలీజైంది. అయితే ఆ తర్వాత పెద్దగా సినీ అవకాశాలు కల్కికి దక్కలేదు. దీనిపై మాట్లాడుతూనే ఈ లైంగిక వేధింపుల గురించి తెలిపింది.

More News

'మత్తువదలరా' కు నేపథ్య సంగీతాన్ని అందించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది! - కాలభైరవ

ఇండస్ట్రీలో తొలి అవకాశం రావడం గొప్ప అన్నది నా సిద్ధాంతం. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా ఆ నియమం నాకు వర్తిస్తుంది అన్నారు కాలభైరవ.

'బ్యూటిఫుల్ ' ప్రీ రిలీజ్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య స‌మ‌ర్ప‌ణ‌లో నైనా గంగూలి, సూరి హీరోహీరోయిన్లుగా

ప్రతి అమ్మాయి నా పాత్ర తో రిలేట్ అవుతుంది. హీరోయిన్  కారుణ్య కత్రేన్

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’.

'జార్జ్ రెడ్డి' చిత్రానికి బెస్ట్ అప్రిసియేషన్ అవార్డు

ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ రోల్ మోడల్ గా పేర్కొనే స్టూడెంట్ లీడర్ "జార్జ్ రెడ్డి" జీవితం ఆధారంగా సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన "జార్జ్ రెడ్డి"

మరో రికార్డ్ దిశగా దూసుకు వెళుతున్న 'బుట్ట బొమ్మ' గీతం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’.