జనవరి 29న కళావతి విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సర్వాంత రామ్ క్రియేషన్స్, గుడ్ ఫ్రెండ్స్ బ్యానర్స్‌పై తమిళంలో సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన అరన్మణై2` చిత్రాన్ని తెలుగులో కళావతి` పేరుతో విడుదల చేస్తున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 29న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్రయూనిట్ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ..
చిత్ర సమర్పకుడు జవ్వాజి రామాంజనేయులు మాట్లాడుతూ ``తమిళంలో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 40 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాం. తెలుగులో సర్వాంత రామ్‌క్రియేషన్స్ బ్యానర్‌ను స్టార్ట్ చేశాం. ఈ బ్యానర్‌పై తెలుగులో సినిమాలను నిర్మిస్తున్నాం. మా బ్యానర్‌పై విడుదలవుతున్న నాలుగో సినిమా ఇది. గుడ్ ఫ్రెండ్స్ బ్యానర్‌తో కలిసి తెలుగులో విడుదల చేస్తున్నాం. సెన్సార్ పూర్తయింది. సెన్సార్ సభ్యులు సినిమాను చూసి బావుందని మెచ్చుకున్నారు. జనవరి 29న సినిమాను గ్రాండ్ లెవల్లో 500 నుండి 600 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. టేబుల్ ప్రాఫిట్లో బిజినెస్ పూర్తయింది. సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన మొదటి పార్ట్ కంటే ఈ పార్ట్ భారీగా ఉంటుంది. నాలుగు కోట్ల వ్యయంతో ఓ బంగ్లా సెట్ వేశాం. అలాగే ఆసియాలో పెద్దదైన అమ్మవారి విగ్రహాన్ని 130 అడుగుల్లో నిర్మించాం. హిప్ హాప్ మంచి మ్యూజిక్ అందించారు. పాటలు, థియేట్రికల్ ట్రైలర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. రజనీకాంత్, కమల్ వంటి సీనియర్ హీరోస్తో వర్క్ చేసిన ష్యూర్ షాట్ హిట్ డైరెక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.హర్రర్, కామెడి, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే చంద్రకళ కంటే రెండింతల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది`` అన్నారు
సుందర్.సి, సిద్ధార్థ్, త్రిష, హన్సిక, పూనమ్ బాజ్వా, మనో బాల, కోవై సరళ, రాధారవి, సూరి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి సమర్పణః జవ్వాజి రామాంజనేయులు, సంగీతంః హిప్ హాప్ తమిళ, నిర్మాతః గుడ్ ఫ్రెండ్స్, దర్శకత్వంః సుందర్.సి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com