కళాతపస్వి కె. విశ్వనాథ్ పుట్టిన రోజు వేడుకలు
Send us your feedback to audioarticles@vaarta.com
కళాతపస్వి కె. విశ్వనాథ్ సువర్ణభూమి డెవలప్పర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్వవహరిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం కె. విశ్వనాథ్ పుట్టిన రోజు సందర్భంగా సువర్ణభూమి ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగాయి.
అనంతరం కె. విశ్వనాథ్ మాట్లాడుతూ, "ప్రతీ దేవాలయంలో ఆర్చక స్వాములుంటారు. వాళ్లలో ఒకరికే భంగవంతుడికి ప్రసాదం వండి వడ్డించే అవకాశం కల్గుతుంది. అలా చూసుకుంటే దేవాలయం లాంటి సినిమా కళలో నేను చేసే వంటను ముందుగా ప్రేక్షకులకు అందించే అదృష్టం నాకు కల్గింది.
సంగీతం, సాహిత్యం మీద అభిమానం తో కాకుండా సిని పరిశ్రమను ఓ దేవాలయంలో భావించి పనిచేశాను. అందుకు కోసం నా నిర్మాతలు ...సాంకేతిక నిపుణులు ఎంతో సహకరించారు. వాళ్ల సహకారం వల్లే నేను ఈస్థాయిలో ఉన్నాను. అందుకోసం వాళ్లందర్నీ చాలా కష్టపెట్టాను. ఈరోజు నా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉంది" అని అన్నారు.
సువర్ణభూమి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ బొలినేని మాట్లాడుతూ, " విశ్వనాథ్ గారు మా కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్వవహరించడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఆయన ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ని కోరుకుంటున్నా" అని అన్నారు.
సువర్ణ భూమి సంస్థ మార్కెంట్ హెడ్ సింసన్ మాట్లాడుతూ, " విశ్వనాథ్ గారు ఎన్నో గొప్ప సినిమాలు చేసి తెలుగు సంప్రదయాన్ని శిఖరస్థానాలకు తీసుకెళ్లారు. మా కష్టమర్ దేవుళ్ళకు సువర్ణభూమి పేరు చెప్పగానే మీ బ్రాండ్ అంబాసిడర్ విశ్వనాథ్ గారు కదాని ఎంతో ఉత్సాహాం చూపిస్తారు. మా సంస్థకు ఆయన పునాది వేశారు. ఈ సందర్భంగా మా సంస్థ తరుపున వందనాలు తెలపుతున్నా" అని అన్నారు.
'మా' అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, " సువర్ణ భూమి వారు మా గురువు గారు పుట్టిన రోజు జరపడం. అలాగే రక్తదాన శిభినం చేయడం సంతోషంగా ఉంది. ఆయనకు సన్మానాలు కొత్తకాదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే ఆయన ఎంతో సంతోష పడతారు. టాప్ ఒకటి నుంచి 10 వరకూ విశ్వనాథ్ గారి సినిమాలే ఉంటాయి. ఆయన తర్వాతే ఎవరైనా " అని అన్నారు.
* అనంతరం సువర్ణభూమి డెవలప్పర్స్ రక్తదాన శిభిరం నిర్వహించింది.
ఈ వేడుకల్లో సువర్ణభూమి సంస్థ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ దీప్తీ బొలినేని, 'మా' వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, కార్యవర్గ సభ్యురాలు ఉత్తేజ్, జయలక్ష్మి పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com