క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ పుట్టిన రోజు వేడుక‌లు

  • IndiaGlitz, [Monday,February 19 2018]

క‌ళాత‌ప‌స్వి కె. విశ్వ‌నాథ్ సువ‌ర్ణ‌భూమి డెవ‌ల‌ప్ప‌ర్స్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్వ‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా సోమ‌వారం కె. విశ్వ‌నాథ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సువ‌ర్ణ‌భూమి ఆధ్వ‌ర్యంలో పుట్టిన రోజు వేడుక‌లు హైద‌రాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఘ‌నంగా జ‌రిగాయి.

అనంత‌రం కె. విశ్వ‌నాథ్ మాట్లాడుతూ, "ప్ర‌తీ దేవాల‌యంలో ఆర్చ‌క స్వాములుంటారు. వాళ్ల‌లో ఒక‌రికే భంగ‌వంతుడికి ప్ర‌సాదం వండి వ‌డ్డించే అవ‌కాశం క‌ల్గుతుంది. అలా చూసుకుంటే దేవాల‌యం లాంటి సినిమా క‌ళ‌లో నేను చేసే వంటను ముందుగా ప్రేక్ష‌కుల‌కు అందించే అదృష్టం నాకు క‌ల్గింది.

సంగీతం, సాహిత్యం మీద అభిమానం తో కాకుండా సిని ప‌రిశ్ర‌మ‌ను ఓ దేవాల‌యంలో భావించి ప‌నిచేశాను. అందుకు కోసం నా నిర్మాత‌లు ...సాంకేతిక నిపుణులు ఎంతో స‌హ‌క‌రించారు. వాళ్ల స‌హ‌కారం వ‌ల్లే నేను ఈస్థాయిలో ఉన్నాను. అందుకోసం వాళ్లంద‌ర్నీ చాలా క‌ష్ట‌పెట్టాను. ఈరోజు నా పుట్టిన రోజు వేడుక‌లు నిర్వ‌హించ‌డం సంతోషంగా ఉంది" అని అన్నారు.

సువ‌ర్ణ‌భూమి సంస్థ‌ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీధ‌ర్ బొలినేని మాట్లాడుతూ, " విశ్వ‌నాథ్ గారు మా కంపెనీ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్వ‌వ‌హ‌రించ‌డం మా పూర్వ జ‌న్మ సుకృతంగా భావిస్తున్నాం. ఆయ‌న‌ ఇలాంటి పుట్టిన రోజు వేడుక‌లు మ‌రెన్నో జ‌రుపుకోవాలని ఆ దేవుణ్ని కోరుకుంటున్నా" అని అన్నారు.

సువ‌ర్ణ భూమి సంస్థ‌ మార్కెంట్ హెడ్ సింస‌న్ మాట్లాడుతూ, " విశ్వ‌నాథ్ గారు ఎన్నో గొప్ప సినిమాలు చేసి తెలుగు సంప్ర‌ద‌యాన్ని శిఖ‌ర‌స్థానాల‌కు తీసుకెళ్లారు. మా క‌ష్ట‌మ‌ర్ దేవుళ్ళ‌కు సువ‌ర్ణ‌భూమి పేరు చెప్ప‌గానే మీ బ్రాండ్ అంబాసిడ‌ర్ విశ్వ‌నాథ్ గారు క‌దాని ఎంతో ఉత్సాహాం చూపిస్తారు. మా సంస్థ‌కు ఆయ‌న పునాది వేశారు. ఈ సంద‌ర్భంగా మా సంస్థ త‌రుపున వంద‌నాలు తెల‌పుతున్నా" అని అన్నారు.

'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, " సువ‌ర్ణ భూమి వారు మా గురువు గారు పుట్టిన రోజు జ‌ర‌ప‌డం. అలాగే ర‌క్త‌దాన శిభినం చేయ‌డం సంతోషంగా ఉంది. ఆయ‌నకు స‌న్మానాలు కొత్త‌కాదు. ఇలాంటి సేవా కార్య‌క్ర‌మాలు చేస్తే ఆయ‌న ఎంతో సంతోష ప‌డ‌తారు. టాప్ ఒక‌టి నుంచి 10 వ‌ర‌కూ విశ్వ‌నాథ్ గారి సినిమాలే ఉంటాయి. ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా " అని అన్నారు.

* అనంత‌రం సువ‌ర్ణ‌భూమి డెవ‌ల‌ప్ప‌ర్స్ ర‌క్త‌దాన శిభిరం నిర్వ‌హించింది.

ఈ వేడుక‌ల్లో సువ‌ర్ణ‌భూమి సంస్థ‌ ఎగ్జిక్యుటివ్ డైరెక్ట‌ర్ దీప్తీ బొలినేని, 'మా' వైస్ ప్రెసిడెంట్ బెన‌ర్జీ, జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, కల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, కార్య‌వ‌ర్గ స‌భ్యురాలు ఉత్తేజ్, జ‌య‌ల‌క్ష్మి పాల్గొన్నారు.

More News

గుండు హనుమంతరావు మృతి తీరని లోటు : చిరంజీవి

తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్యనటుడిదీ ఒక్కో శైలి. అలానే గుండు హనుమంతరావుగారు సైతం తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తూ వచ్చారు. ఆ మధ్య ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి కలత చెందాను. నా వంతు సాయం అందించాను.

'సంత' తొలి షెడ్యూల్ పూర్తి

సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

బెల్లంకొండ శ్రీనివాస్ నెక్ట్స్‌ ప్రాజెక్ట్ అప్‌డేట్‌

'అల్లుడు శీను' సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన‌ యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. ఆ తర్వాత 'స్పీడున్నోడు', 'జయ జానకి నాయక' సినిమాలతో ప‌ల‌క‌రించాడు. ఇవేవీ ఆశించిన విజ‌యాన్ని అందివ్వ‌లేక‌పోయాయి.

సంక్రాంతికి రానున్న బాల‌య్య 'యన్.టి.ఆర్' ?

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా 'యన్.టి.ఆర్' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ  ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న‌ ఈ చిత్రానికి బాల‌కృష్ణ ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహ నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.