అక్టోబర్ 27న 'కాళరాత్రి' షూటింగ్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
వి.జె.వై.ఎస్.ఆర్ ఆర్ట్స్ పతాకంపై పి.ఆర్.బాబు దర్శకత్వంలో కామెడీ, సెంటిమెంట్, హార్రర్ ప్రధానాంశాలుగా రూపొందనున్న 'కాళరాత్రి' చిత్రం షూటింగ్ అక్టోబర్ 27న గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానున్నది. సంగీత దర్శకుడు సత్య కాశ్యప్ (ఐస్‌క్రీమ్ ఫేమ్) సంగీతం సమకూర్చగా గీతా మాధురి, అక్షయ్, స్వరరాజ్ గానం చేయగా, నాలుగు పాటలు ఇటీవల రికార్డింగ్ చేశారు.
ఈ చిత్రంలో హీరోగా నూతన నటుడ్ని పరిచయం చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. శాలినిసింగ్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇతర పాత్రల్లో జీవా, రాంజగన్, జాకీ, దువ్వాసి మోహన్, రాళ్లపల్లి, తిరుపతి ప్రకాష్, చిట్టిబాబు తదితరులు నటించే ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటి ఒక ప్రధాన పాత్రలో నటించనున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: సత్యకాశ్యప్, కెమెరా: వెంకట్, ఎడిటింగ్: భద్రం, పాటలు: శివశంకర్, డ్యాన్స్: సామ్రాట్, ప్రొడక్షన్ మేనేజర్స్: వినయ్, చంద్రశేఖర్, సహ నిర్మాతలు: తనూజ, జి.శ్రీనివాస్, వై.శేషిరెడ్డి, కోడైరెక్టర్: ప్రవీణ్‌కుమార్, నిర్మాణం: విజెవైఎస్ఆర్ ఆర్ట్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.ఆర్.బాబు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments