సాంగ్స్ రికార్డింగ్ లో 'కాళకేయ వర్సెస్ కాట్రవల్లి'

  • IndiaGlitz, [Thursday,December 15 2016]

బాహుబలి సినిమాలో కాళకేయ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో రాజమౌళి సృష్టించిన కాళకేయుడి పాత్రలో ప్రభాకర్ నటింగా ఈ పాత్రకుప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇప్పుడు ప్రభాకర్‌తో పాటు స్టార్ క‌మెడియ‌న్ అలీ లీడ్ రోల్స్‌లో రూపొందుతోన్న చిత్రం కాళ‌కేయ వ‌ర్సెస్ కాట్ర‌వల్లి. త‌న‌దైన కామెడితో, పంచ్‌ల‌తో కామెడీకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన అలీ, ప్రభాకర్ కాంబినేషన్‌లో ఓగిరాల మూవీస్ బ్యాన‌ర్‌లో శ్రీపురం కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో వేమూరి నాగేశ్వ‌ర‌రావు నిర్మిస్తున్న చిత్రం 'కాలకేయ వర్సెస్ కాట్రవల్లి' సినిమా సాంగ్ రీకార్డింగ్ కార్య‌క్ర‌మం డిసెంబ‌ర్ 15న స్టార్ట్ అయ్యింది. జ‌న‌వ‌రి నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది.

రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై దాస‌రి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రూపొందిన స‌క్సెస్‌ఫుల్ మూవీ 'రామ్‌లీల‌'ను తెర‌కెక్కించిన శ్రీపురం కిర‌ణ్ ఈ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెర‌కెక్కించ‌నున్నారు. గోపాల గోపాల చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన దేవుడి క్యార‌క్ట‌ర్ త‌ర‌హా పాత్ర‌లో కాళ‌కేయ వ‌ర్సెస్ కాట్ర‌వ‌ల్లి చిత్రంలో ఓ ప్ర‌ముఖ న‌టుడు న‌టించ‌బోతున్నారు.
అలీ, కాళ‌కేయ ప్ర‌భాక‌ర్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సుక్కు సంగీతం అందిస్తుండ‌గా చంద్ర‌బోస్ సాహిత్యాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ముర‌ళీమోహ‌న్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీని వ‌ర్క్‌ను అందిస్తున్నారు.

More News

ల‌హ‌రి ద్వారా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ రిలీజ్..!

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.

రానని చెప్పిన విశాల్ వచ్చేస్తున్నాడు

తెలుగు,తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నయువ కథానాయకుడు విశాల్ నటించిన తాజా చిత్రం కత్తి సాందాయ్.

ఈనెల 23న ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం

అల్ల‌రి న‌రేష్ హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హర్ర‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం. అత్తారింటికి దారేది, నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రాల‌ను నిర్మించిన భారీ చిత్రాల నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర అధినేత‌ బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా ఛాన్స్ ఇవ్వ‌డానికి జ‌గ్గుభాయ్ రెడీ..మ‌రి మీరు..?

సినిమా రంగం పై అభిరుచి, ఆసక్తి ఉన్నా..చాలా మందికి అవకాశాల కోసం ఎవర్ని సంప్రదించాలో, తమ ప్రతిభను  ఎలా నిరూపించుకోవాలో తెలియని ప‌రిస్థితి. అందుక‌నే సినీ రంగంలో ప్ర‌వేశించాల‌నుకునే  ఔత్సాహికుల కోసం జ‌గ‌ప‌తిబాబు 'క్లిక్ సినీ కార్ట్' అనే సంస్థను నెలకొల్పిన విష‌యం తెలిసిందే.

సూర్య సింగం 3 వాయిదా..!

సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం సింగం 3.సింగం సిరీస్ లో మూడో సినిమాగా వస్తున్న సింగం3