సాంగ్స్ రికార్డింగ్ లో 'కాళకేయ వర్సెస్ కాట్రవల్లి'
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సినిమాలో కాళకేయ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో రాజమౌళి సృష్టించిన కాళకేయుడి పాత్రలో ప్రభాకర్ నటింగా ఈ పాత్రకుప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇప్పుడు ప్రభాకర్‌తో పాటు స్టార్ కమెడియన్ అలీ లీడ్ రోల్స్‌లో రూపొందుతోన్న చిత్రం కాళకేయ వర్సెస్ కాట్రవల్లి. తనదైన కామెడితో, పంచ్‌లతో కామెడీకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన అలీ, ప్రభాకర్ కాంబినేషన్‌లో ఓగిరాల మూవీస్ బ్యానర్‌లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో వేమూరి నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం `కాలకేయ వర్సెస్ కాట్రవల్లి` సినిమా సాంగ్ రీకార్డింగ్ కార్యక్రమం డిసెంబర్ 15న స్టార్ట్ అయ్యింది. జనవరి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.
రామదూత క్రియేషన్స్ బ్యానర్‌ఫై దాసరి కిరణ్‌కుమార్ నిర్మాతగా రూపొందిన సక్సెస్‌ఫుల్ మూవీ `రామ్‌లీల`ను తెరకెక్కించిన శ్రీపురం కిరణ్ ఈ కామెడి ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నారు. గోపాల గోపాల చిత్రంలో పవన్ కల్యాణ్ నటించిన దేవుడి క్యారక్టర్ తరహా పాత్రలో కాళకేయ వర్సెస్ కాట్రవల్లి చిత్రంలో ఓ ప్రముఖ నటుడు నటించబోతున్నారు.
అలీ, కాళకేయ ప్రభాకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సుక్కు సంగీతం అందిస్తుండగా చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. మురళీమోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీని వర్క్‌ను అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com