తెలుగుతో పాటూ..తమిళ, కన్నడ భాషల్లోనూ హవా కొనసాగిస్తున్న కాళకేయ ప్రభాకర్

  • IndiaGlitz, [Monday,July 31 2017]

మ‌ర్యాద రామ‌న్న సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన ప్ర‌భాక‌ర్, ఆ త‌ర్వాత దూకుడు, గ‌బ్బ‌ర్ సింగ్,, సీమ ట‌పాకాయ్, దొంగాట‌, య‌మ‌హో య‌మ‌, క్రిష్ణం వందే జ‌గ‌ద్గురం,దూసుకెళ్తా, ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్లి, డీజే, ప‌టేల్ సార్ వంటి చాలా సినిమాల్లో నటించిన‌ప్ప‌టికీ, బాహుబ‌లిలో కాల‌కేయ గా కిలి కిలి భాష‌లో మాట్లాడి ప్ర‌పంచానికి ఒక కొత్త భాష‌ను ప‌రిచ‌యం చేసి, తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి స్థానం సంపాదించిన విష‌యం తెలిసిందే. కేవ‌లం తెలుగులోనే కాకుండా, త‌మిళ‌, క‌న్న‌డ భాషల్లోనూ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటున్న త‌రుణంలో త‌న ఆనందాన్ని వ్య‌క్త‌పరుస్తూ..

ప్రభాకర్ మాట్లాడుతూ, ''న‌న్ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన రాజ‌మౌళి గారికి ఎప్ప‌టికీ ఋణ‌ప‌డి ఉంటాను. సామాన్య ప్ర‌జ‌ల‌లో ఒక‌డిగా ఉన్న న‌న్ను, ఈ రోజు నేను ఎక్క‌డికి వెళ్లినా, న‌న్ను గుర్తు ప‌డుతున్నారంటే దానికి కార‌ణం రాజ‌మౌళి గారే. మొద‌ట్లో మ‌ర్యాద రామ‌న్న లో నాకు మంచి పాత్ర ఇచ్చి ప్రోత్స‌హించిన రాజ‌మౌళి గారు, ఆ త‌ర్వాత బాహుబ‌లిలో విల‌న్ గా కిలికిలి భాష‌తో న‌న్ను నిరూపించుకునేందుకు మ‌రో మంచి అవ‌కాశం ఇచ్చారు. బాహుబ‌లి త‌ర్వాత నాకు చాలా మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కేవ‌లం ఇటు తెలుగు ప‌రిశ్ర‌మ నుంచే కాకుండా త‌మిళ ప‌రిశ్ర‌మ నుంచి కూడా నేను అవ‌కాశాలు అందుకుంటున్నాను. ఈ సంద‌ర్భంగా న‌న్ను ఆద‌రించిన‌, ఆద‌రిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను'' అన్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా సినిమాలో మెయిన్ విల‌న్ గా, డైర‌క్ట‌ర్ ప్ర‌భు సాల్మ‌న్ సినిమాలోనూ, మ‌ల‌యాళంలో మ‌మ్ముటి సార్ సినిమా, క‌న్న‌డ‌లో సునీల్ దేశాయ్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా మ‌రియు తెలుగులో బాల‌కృష్ణ గారి సినిమాలో న‌టిస్తున్నాన‌ని ప్ర‌భాక‌ర్ అలియాస్ కాళ‌కేయ చెప్పారు.