జనవరి 29న 'కళావతి'
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో అరన్మణిగా తెలుగులో చంద్రకళగా సూపర్‌డూపర్ హిట్టయిన చిత్రానికి సీక్వెల్ అరన్మణి2 రూపొందింది. ఈ చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సర్వంత్రామ్ క్రియేషన్స్ ,ఈరోజుల్లో, రోమాన్స్ లాంటి పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్ తెలుగులో కళావతిగా తెలుగులో విడుదల చేస్తున్నారు. సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా ముఖ్య పాత్రలు పోషించారు.
హార్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. హిప్ హాప్ తమిళ సంగీతమందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో ఆదివారం విడుదలైంది. ప్రమోషనల్ సాంగ్ ను ఖుష్బూ విడుదల చేశారు. బిగ్ సీడీ, థియేట్రికల్ ట్రైలర్ ను దిల్ రాజు విడుదల చేశారు. ఆడియో సీడీలను దిల్ రాజు విడుదల చేసి తొలి సీడీని సుందర్.సికు అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మారుతి, సిద్ధార్థ్, జవ్వాజి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
చంద్రకళ చిత్రం తెలుగులో పెద్ద హిట్టయింది. అయితే ముందు ఆ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన లేదు. కానీ అందరూ క్లయిమాక్స్ సీన్ ను చూసి సీక్వెల్ చేస్తున్నారా అని అడగటంతో సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చింది. మొదటి భాగం కంటే ఈ సెకండ్ పార్ట్ ఇంకా భారీగా తెరకెక్కించామని సుందర్.సి అన్నారు.
హర్రర్ కామెడి చిత్రం చేయడం ఇదే మొదటిసారి. సుందర్ గారు ష్యూర్ షాట్ హిట్ సినిమాలను తీసే దర్శకుడు. ఆయనతో పాటు త్రిష, హన్సిక, పూనంలతో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని ప్రేక్షకులు సినిమా చూసి భయపడటంతో పాటు థ్రిల్ ఫీలవుతారని హీరో సిద్ధార్థ్ అన్నారు.
చంద్రకళ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. హర్రర్, కామెడి కాన్సెప్ట్ తోనే ఈ సీక్వెల్ కూడా భారీగా రూపొందింది. సినిమాను జనవరి 29న విడుదల చేయాలనుకుంటున్నామని చిత్ర సమర్పకులు జవ్వాజి రామాంజనేయులు తెలిపారు.
సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక, పూనమ్ బాజ్వా, సూరి, కోవై సరళ, రాధా రవి తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సమర్పణ - శ్రీ జవ్వాజి రామాంజనేయులుసంగీతం - హిప్ హాప్ తమిళ, నిర్మాణం- గుడ్ ఫ్రెండ్స్, దర్శకుడు - సుందర్ సి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout