సెప్టెంబర్ లో రానున్న కాకతీయుడు

  • IndiaGlitz, [Tuesday,August 02 2016]

నంద‌మూరి తార‌క‌ర‌త్న‌, శిల్ప‌, యామిని, రేవ‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం కాక‌తీయుడు. ఎల్.వి.ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ల‌గ‌డ‌పాటి శ్రీనివాస్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. వి.స‌ముద్ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో డైరెక్ట‌ర్ వి.స‌ముద్ర మాట్లాడుతూ...స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే చిత్ర‌మిది. విద్య‌, వైద్య వ్య‌వ‌స్థ‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌డం వ‌ల‌న మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు ఏవిధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..? స్వార్ధ ప్ర‌యోజ‌నాల‌తో రాజ‌కీయాల్లో ప్ర‌వేశిస్తున్న నాయ‌కుల వ‌ల‌న ఎలాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌మౌతున్నాయి..? అనే క‌ధాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తార‌క‌ర‌త్న పాత్ర భిన్న‌కోణాల్లో ఉంటుంది. ఈ మూవీలో తార‌క‌ర‌త్న సిక్స్ ప్యాక్ చేసారు. ఈ పాత్ర కోసం తార‌క‌ర‌త్న ప్ర‌త్యేకంగా సిద్దం కావాల్సి ఉండ‌డం వ‌ల‌న సినిమా ఆల‌స్యం అయ్యింది.
ఎన్టీఆర్ కు బొబ్బిలిపులి, బాల‌కృష్ణ‌కు సింహ‌, జూనీయ‌ర్ ఎన్టీఆర్ కు ఆది, క‌ళ్యాణ్ రామ్ కు అత‌నొక్క‌డే త‌ర‌హాలో తార‌క‌ర‌త్న కెరీర్ లో కాక‌తీయుడు మంచి చిత్రంగా నిలుస్తుంది. నా గ‌త చిత్రాల వ‌లే చ‌క్క‌టి క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ చిత్రాన్ని రూపొందించాను. మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందించిన ఈ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది అన్నారు. విద్య వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను చ‌ర్చిస్తూ చ‌క్క‌టి సందేశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని నిర్మాత తెలియ‌చేసారు. టైటిల్ చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంది. స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే మంచి పాయింట్ తో స‌ముద్ర ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. తార‌క‌ర‌త్న ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు అని శోభారాణి తెలిపారు. ఆంధ్రా ఏరియాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామ‌ని గూడూర్ గోపాల్ శెట్టి పేర్కొన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో రేవ‌తి చౌద‌రి, సుబ్బారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. వినోద్ కుమార్, ప్ర‌భ‌, ల‌గ‌డ‌పాటి వెంక‌ట్రావు త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - ఎస్.ఆర్ శంక‌ర్, కెమెరామెన్ - పి.స‌హ‌దేవ్, స‌హ నిర్మాత‌లు - గుర్రం మ‌హేష్ చౌద‌రి, గూడూర్ గోపాల్ శెట్టి, పొందూరు కాంతారావు, నిర్మాత - ల‌గ‌డ‌పాటి శ్రీనివాస్, క‌థ స్ర్కీన్ ప్లే ద‌ర్శ‌క‌త్వం - వి.స‌ముద్ర‌.