కాజోల్ కి మరోసారి ఎదురు దెబ్బ
- IndiaGlitz, [Sunday,August 13 2017]
బాలీవుడ్‌లో కాజోల్ స్టార్ హీరోయిన్‌గా రాణించింది. పెళ్లయ్యాక కూడా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. మంచి పాత్ర అనిపిస్తే దక్షిణాదిలోనూ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపింది కాజోల్. తన కెరీర్ మొత్తమ్మీద దక్షిణాదిలో ఇప్పటి వరకు రెండే రెండు సినిమాల్లో నటించిందీ టాలెంటెడ్ యాక్ట్రస్. అవి కూడా తమిళ సినిమాలే కావడం గమనార్హం.
1997లో అరవింద్‌స్వామి, ప్రభుదేవా హీరోలుగా రూపొందిన మిన్సార కణవు (తెలుగులో మెరుపు కలలు) చిత్రంలో సందడి చేసిన కాజోల్.. 20 ఏళ్ల గ్యాప్ తరువాత విఐపి 2 (రఘవరన్ బి.టెక్ సీక్వెల్.. తెలుగులో త్వరలోనే అనువాదం కానుంది)లో నెగెటివ్ టచ్ ఉన్న రోల్‌తో దర్శనమిచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయి. ఏదేమైనా కాజోల్‌కి దక్షిణాది అస్సలు కలిసిరాలేదు.