ప్రయివేటుగా భర్తకు ముందే చూపించిన కాజల్!
Send us your feedback to audioarticles@vaarta.com
నారీ నారీ నడుమ మురారి... హిట్లు సినిమా! ఇరువురి భామల మధ్య మగమహారాజు చిక్కుకున్న సందర్భాన్ని వర్ణించడానికి ‘నారీ నారీ నడుమ మురారి’ అనేది వాడతారు. మరి, ఆ నారీ ఈ నారీ ఒక్కరే అయితే? కాజల్ అగర్వాల్ భర్తకు అటువంటి పరిస్థితి ఎదురైంది. అదీ ఇప్పుడు కాదులెండి... కొన్నాళ్ల క్రితం! సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో కాజల్ మైనపు బొమ్మను సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ బొమ్మ ఓ వైపు... అసలైన కాజల్ మరోవైపు... మధ్యలో గౌతమ్ కిచ్లూ! ఫొటో చూశారుగా!! రీసెంట్గా కాజల్ షేర్ చేసింది. అటో కాజల్... ఇటో కాజల్ ఉన్నప్పటికీ, గౌతమ్ ఏమాత్రం పక్కచూపులు చూడలేదు. అసలైన కాజల్‌ను చూశాడు.
కాజల్ ఈ ఫొటో షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే... ఆ మైనపు బొమ్మను ప్రతిష్ఠించి ఫిబ్రవరి 5కి ఏడాది. అయితే, భర్తకు ఆ బొమ్మను కాజల్ ముందే చూపించింది. గత ఏడాది ఫిబ్రవరి 5న గౌతమ్‌కి జర్మనీలో అఫీషియల్ వర్క్ ఉండటంతో ఒక రోజు ముందే సింగపూర్ చేరుకున్నాడు. కొన్ని గంటలు మాత్రమే ఉన్నాడు. ఆ టైమ్‌లో ఫిబ్రవరి 4న ప్రయివేటుగా భర్తకు తన బొమ్మ ఓలా ఉంటుందో కాజల్ చూపించింది. అదీ మేటర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com