మరో కొత్త దర్శకుడితో కాజల్?
Send us your feedback to audioarticles@vaarta.com
'ఖైదీ నంబర్ 150', 'నేనే రాజు నేనే మంత్రి'తో పాటు ఇటీవల విడుదలైన 'అ!' సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకున్నారు కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఆమె నటించిన 'ఎం.ఎల్.ఎ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 'అ!', 'ఎం.ఎల్.ఎ'.. ఇలా ఈ రెండు చిత్రాలు కూడా కొత్త దర్శకులు రూపొందించిన చిత్రాలు కావడం విశేషం.
వీటితో పాటు మరో కొత్త దర్శకుడి సినిమాకి కూడా కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా డెబ్యు డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా కాజల్ కథానాయికగా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు కథానాయికలకు అవకాశమున్న ఈ చిత్రంలో కాజల్ ఓ హీరోయిన్ గా నటించనున్నారు.
ఈ నెల 23న ప్రారంభమైన ఈ చిత్రం మార్చి 2 నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం. మల్టీ డైమెన్షన్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. కాగా, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నూతన దర్శకుడు నాని డైరెక్షన్లో రూపొందనున్న సినిమాలో కాజల్ నటించనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి.ప్రస్తుతానికి ఆ సినిమాని హోల్డ్ లో పెట్టారు. ఇప్పుడు ఆ సినిమా కోసం కాజల్ ఇచ్చిన కాల్షీట్స్తోనే ఈ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. కాజల్ ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments