మహేష్ నెక్ట్స్ మూవీలో పాట పాడనున్న హీరోయిన్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో నిర్మించింది. ఈ నెల 20న బ్రహ్మోత్సవం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. బ్రహ్మోత్సవం ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మహేష్, కాజల్ ఓ ఛానల్ కి ఇంటర్ వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్ వ్యూలో..యాంకర్ మాట్లాడుతూ...మాట్లాడుతూ ఓ పాట పాడేసింది. కాజల్ తో మీరు కూడా పాడండి అన్నది. నేనా..పాట పాడడమా అంది కాజల్. మహేష్ మామూలోడు కాదు కదా...ఈమధ్య కాజల్ పాట పాడింది అంటూ ఎవరో లింక్ పంపించారు. తీరా చూస్తే...అది తెలుగు పాట కాదు...కన్నడ పాట పాడేసింది అంటూ తనదైన స్టైల్ లో స్పందించాడు. యాంకర్ ఇక్కడితో ఈ టాపిక్ ఆపకుండా... మహేష్ నెక్ట్స్ మూవీలో మీరు ఓ సాంగ్ పాడాలి అని కాజల్ తో అంది. ఇంకేముంది ఓకే పాడతాను అన్నది కాజల్. ఆవిధంగా మహేష్ నెక్ట్స్ మూవీలో పాట పాడతాను అని చెప్పింది కథానాయిక కాజల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments