లారెన్స్ తో కాజల్..?
Send us your feedback to audioarticles@vaarta.com
డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా తనదైన శైళిలో రాణిస్తున్నాడు రాఘవేంద్ర లారెన్స్. ముని సీక్వెల్స్‌తో సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా లారెన్స్ వరుస విజయాలను అందుకుంటున్నాడు. ముని, కాంచన(ముని2), గంగ (ముని3) సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టాయి. ఇప్పుడు లారెన్స్ ఈ సీక్వెల్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కథను సిద్ధం చేస్తున్నాడట. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది హీరోయిన్స్ నటిస్తారంటున్నారు. ముని సీక్వెల్స్‌లో ఏదో ఒక సామాజిక విషయాన్ని తెలియజేస్తున్న లారెన్స్, ఈ సినిమాలో కూడా ఓ సామాజిక అంశాన్ని టచ్ చేస్తున్నాడట. అలాగే ముని4లో కాజల్ నటించే అవకాశాలున్నాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com