లాక్ డౌన్‌లోనూ కాజల్‌, తమన్నాకు లక్షల్లో ఆదాయం!

  • IndiaGlitz, [Tuesday,May 19 2020]

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌తో సామాన్యుడి మొదలుకుని సెలబ్రిటీల వరకూ ఇంటికే పరిమితం అయ్యారు. ఇప్పుడు మళ్లీ 4.0 లాక్ డౌన్ నడుస్తుండటంతో జులై వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో నటీనటులు ఏం చేద్దాం..? అని ఆలోచించి లాక్ డౌన్‌లోనూ ఆదాయం ఉండే మార్గాలను ఎంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా.. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ ఈ టైమ్‌లోనూ లక్షల్లో సంపాదించేస్తోందట. అదేంటి ఇప్పుడేం సినిమాల్లేవుగా..? పైగా ఇంట్లో కూర్చొని ఎలాగబ్బా..? అని ఆలోచిస్తు్న్నారా..? నిజమే.. కాజల్‌తో పాటు మిల్క్ బ్యూటీ తమన్నా కూడా లక్షల్లో సంపాదిస్తోందట. అది కూడా సింగిల్ పోస్ట్‌కేనట. ఇంత ఆ లెక్కల కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సర్వం సోషల్ మీడియా..

ప్రస్తుతం సోషల్ మీడియా ఏ రేంజ్‌లో వర్కవుట్ అవుతోందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ మీడియమే జీరోను హీరో చేస్తోంది.. హీరోను జీరో కూడా చేస్తోంది. ఇలా సోషల్ మీడియా ద్వారానే ఎన్నో ప్రాడక్ట్స్ సక్సెస్‌ ఫుల్‌గా రన్ అవుతున్నాయి కూడా. అయితే.. దీన్ని ఎంతో మంది మంచి పనులకు వాడుకుంటుండగా.. మరికొంత మంది చిల్లరపనులకు వాడుకుంటున్నారు. అంతేకాదు కొన్ని కొన్ని సోషల్ మీడియా యాప్స్ ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్, రొపొసో.. ఇలాంటి కొన్ని యాప్‌ల ద్వారా ఆదాయం కూడా వస్తోంది. ఫాలోవర్స్‌ను బట్టి.. ఎక్కువ మంది వారి వీడియోలను చూసినా పైసలు వస్తున్నాయ్.

లక్షలు మొదలుకుని కోట్లు..!

అలానే సెలబ్రిటీలైతే దీన్ని తెగ వాడేస్తుంటారు. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండటానికి అప్డేట్స్ ఇస్తుంటారు. మరోవైపు కమర్షియల్ యాడ్స్‌ను కూడా తమ సోషల్ మీడియా ఖాతాలా ద్వారా షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో ఇంట్లో ఖాళీగా ఉన్న నటీమణులు ఇలానే కమర్షియల్ యాడ్స్‌తో లక్షలు మొదలుకుని కోట్లు సంపాదిచేస్తున్నారు. వీరిలో కాజల్, తమన్నా టాప్‌లో ఉండగా.. కృతిసనన్‌తో పాటు పలువురు నటీమణులు తర్వాతి స్థానంలో ఉన్నారు. వీరే కాదు బాలీవుడ్‌కు చెందిన నటులు కూడా గట్టిగానే సంపాదించేస్తున్నారు.

కాజల్, తమన్నా లెక్కలివీ..

ఇన్ స్టాగ్రాంలో కాజల్‌కు 14.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తమన్నాకు కూడా 10.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. వీరిద్దరూ ప్రమోషనల్ అనగా యాడ్స్‌ పోస్ట్ చేస్తూ.. సింగిల్ పోస్ట్‌కు నాలుగు నుంచి ఐదు లక్షలు.. ఇంకా పెద్ద ప్రొడక్ట్స్‌కు సంబంధించినవి అయితే 5 నుంచి 10 లక్షలు దాకా తీసుకుంటున్నారట. ఈ విషయాన్ని ట్రేడ్ విశ్లేషకులు వెలుగులోకి తెచ్చినట్లు తెలియవచ్చింది. మొత్తానికి చూస్తే వీళ్ల గ్లామర్, ఇమేజ్ అనేది ఇలా కూడా ఉపయోగపడుతోందన్న మాట. చూశారు కదా.. లాక్ డౌన్‌లో ఎలా సంపాదించేస్తున్నారో.. పాపులారిటీ ఉంటే పైసలు వాటంతట అవే మనదగ్గరికొస్తాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్న మాట.

More News

భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా అనసూయ నో చెప్పిందట

తెలుగులో బిగ్‌బాస్ 1,2,3 షోలు ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్‌కు జూనియర్ ఎన్టీఆర్..

అప్పు చేసి సినిమా చేస్తున్న మ‌నోజ్‌!!

మంచు మోహ‌న్‌బాబు త‌న‌యుల్లో రెండో వాడైన మంచు మ‌నోజ్ న‌టుడిగా త‌నకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు.

‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’... సంజ‌య్ ద‌త్ లుక్ లీక్‌

య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `కె.జియ‌ఫ్‌`. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.

బాలీవుడ్ హీరోతో పూరి..!

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా డైరెక్ట‌ర్‌గా త‌న‌దైన ముద్ర వేశాడు డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌.

గాడ్సేను దేశభక్తుడన్న నాగబాబు.. తిట్టిపోస్తున్న ఫ్యాన్స్

జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా పేర్కొంటూ జనసేన పార్టీ నేత,