ఆ హీరోను స్పాంటేనియస్ అంటున్న హీరోయిన్

  • IndiaGlitz, [Monday,August 10 2015]

విశాల్ హీరోగా సర్వంత్ రామ్ క్రియేషన్స్, సాయిచంద్ర ఫిలింస్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం జయసూర్య'(పాయుమ్ పులి). ఆగస్ట్ 22న ఆడియో, సెప్టెంబర్ 4న సినిమా విడుదలకు రెడీ అవుతున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తనకేం కావాలో తెలిసిన అమ్మాయిగా నటించాను. అయితే రోడ్ క్రాస్ చేయడానికి భయపడుతుంటాను. అలాంటి ఓ డిఫరెంట్ రోల్ చేశాను.

విశాల్ గురించి చెప్పాలంటే సెట్ లో చాలా స్పాంటేనియస్ గా ఉంటాడు అని కాజల్ చెప్పుకొచ్చింది. అలాగే రాఘవ లారెన్స్ డ్యాన్స్ లంటే చాలా ఇష్టం. ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేయడాన్ని ఇష్టపడుతుంటాను. ఆయనతో నటించ అవకాశం వచ్చినందుకు హ్యపీగా ఉంది అంటూ తన నెక్స్ ట్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పుకొచ్చింది.