వెంకీకి నో చెప్పిన కాజల్?
Send us your feedback to audioarticles@vaarta.com
గురు తరువాత దాదాపు తొమ్మిది నెలల గ్యాప్‌తో విక్టరీ వెంకటేష్ సినిమా పట్టాలెక్కనుంది. నేనే రాజు నేనే మంత్రితో పదిహేనేళ్ల తరువాత విజయాన్ని అందుకున్న తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఆట నాదే వేట నాదే అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు మరో కథానాయకుడు కూడా నటించనున్నాడు. అయితే అది నెగటివ్ రోల్ అని.. అందులో నారా రోహిత్ నటించే అవకాశముందని మీడియాలో కథనాలు వినిపించాయి.
అలాగే.. వెంకీ సరసన నటించే హీరోయిన్‌గా అనుష్క, మెహరీన్ పేర్లు వినిపించినా.. చివరకి కాజల్ కన్‌ఫర్మ్ అయిందని న్యూస్ వచ్చింది. అయితే.. లేటెస్ట్ ఇన్‌ఫర్‌మేషన్ ప్రకారం ఈ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించడం లేదని తెలిసింది. కాల్షీట్ల సమస్య కారణంగా కాజల్ ఈ సినిమాని సున్నితంగా తిరస్కరించిందని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం కాజల్.. తన తొలి తెలుగు చిత్ర కథానాయకుడు కళ్యాణ్‌రామ్‌తో ఎం.ఎల్.ఎ అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్‌లోనూ కాజల్ కథానాయికగా నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments