డాక్టర్‌గా కాజల్
Send us your feedback to audioarticles@vaarta.com
10 ఏళ్ల కెరీర్లో 50 చిత్రాలను చేసింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఇటీవలే వచ్చిన నేనే రాజు నేనే మంత్రితో 50 చిత్రాల మైలురాయికి చేరుకుందీ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే.. ఆమె నటించిన తాజా తమిళ చిత్రం మెర్సల్ ఈ నెల 18న దీపావళి కానుకగా విడుదల కానుంది. తెలుగులో అదిరింది పేరుతో అదే రోజున విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్ హీరోగా నటించాడు.
కాజల్‌తో పాటు సమంత, నిత్యా మీనన్ కూడా హీరోయిన్లుగా నటించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతమందించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించాడు. అదిరిందిలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా.. తన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని కాజల్ చెబుతోంది. ఒక గొప్ప కథతో తెరకెక్కిన అదిరిందిలో తను డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పింది కాజల్. బాధ్యతతో కూడుకున్న ఈ పాత్ర తనకు మంచి పేరు తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేస్తోందీ భామ. ప్రస్తుతం కాజల్ ఎం.ఎల్.ఎ అనే తెలుగు చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె తొలి కథానాయకుడు కళ్యాణ్ రామ్ హీరో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments