ఆ రెండు చోట్ల ప్లాన్ చేస్తున్న కాజల్!
Send us your feedback to audioarticles@vaarta.com
దశాబ్దంపైగా తెలుగు, తమిళ చిత్రాలతో పాటు అడపాదడపా చేసిన హిందీ చిత్రాలతో హీరోయిన్గా తనదైన గుర్తింపును సంపాదించుకుంది కాజల్ అగర్వాల్. ఈ అందాల చందమామ రీసెంట్గా తన ప్రేమికుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మాల్దీవుల్లో ఇద్దరూ హానీమూన్ ట్రిప్‌లో కూడా ఉన్నారు. దీంతో పాటు కాజల్ ఓ సొంత ఇంటి నిర్మాణాన్ని కూడా స్టార్ట్ చేసేసింది. అది పూర్తి కాగానే తన మకాంను భర్తతో కలిసి అక్కడే పెట్టనుంది కాజల్. ఇవన్నీ పక్కకు పెడితే సినీ పరిశ్రమతో ముఖ్యంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోనే కాజల్ అగర్వాల్ ఎక్కువగా సినిమాలు చేసింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకరిద్దరిని మినహా తెలుగు, తమిళ సినీ పరిశ్రమల నుండి పెద్దగా ఎవరినీ పిలవలేదు కాజల్. కానీ హానీమూన్ తర్వాత ఇటు హైదరాబాద్, అటు చెన్నైలలో తన మ్యారేజ్ రిసెప్షన్‌ను ప్లాన్ చేసిందట. వీటిని ఇండస్ట్రీ ప్రముఖులందరినీ ఆహ్వానిస్తుందట కాజల్. సినిమాల విషయానికి వస్తే కాజల్ కమిట్ అయిన వాటిలో చిరంజీవి ఆచార్య ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇక భారతీయుడు 2 సినిమా ఆగింది. మరి ఈ రెండు సినిమాలకు డేట్స్ ఎప్పటి నుండి కేటాయిస్తుందో ఏమో కాజల్ అగర్వాల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments