ఐటమ్‌సాంగ్ చేయనున్న కాజల్?
Send us your feedback to audioarticles@vaarta.com
కథానాయికగా ఎనిమిదేళ్లకు పైగా అలరిస్తోంది కాజల్ అగర్వాల్. హీరోయిన్గా ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ సుందరి.. ఇప్పటివరకు ఐటమ్ సాంగ్స్ జోలికి వెళ్లనే లేదు. అయితే.. తాజాగా ఓ ప్రత్యేక గీతానికి కాజల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందన్నది టాలీవుడ్ టాక్.
పెద్ద హీరో, అగ్ర దర్శకుడు కాంబినేషన్లో వస్తున్న ఓ సినిమా కోసం కాజల్ స్పెషల్ సాంగ్ చేసేందుకు ఓకే చెప్పిందట. ఈ పాటకిగానూ కాజల్ కి భారీ పారితోషికమే లభించనుందని సమాచారమ్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారకంగా వెలుగులోకి వస్తాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com