కాజల్ ఉన్నట్టా? లేనట్టా?
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్నటికి నిన్న మేకప్ గురించి కామెంట్ చేసి, బోల్డ్ గా ఫొటోలు పెట్టిన కాజల్ పేరు ఇవాళ ఇంకో రీజన్‌తో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఆ రీజన్ పేరు భారతీయుడు సీక్వెల్. ఇండియన్ 2లో కాజల్ హీరోయిన్‌గ నటించనున్నట్టు అధికారికంగా వార్తలు వచ్చాయి. అయితే మధ్యలో కమల్‌హాసన్ రాజకీయ అరంగేట్రం... ప్రొడక్షన్ వ్యయం ఎక్కువవుతుందని లైకా అనడం.. ఇలాంటి కారణాల వల్ల సినిమా ఫ్లోర్ మీదకు వెళ్లడంలో జాప్యం జరిగింది.
మే ఆఖరున ఈ సినిమా షూటింగ్‌లో కాజల్ పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ చిత్ర యూనిట్ ఆమెను కోరిన కాల్షీట్ ఆమె దగ్గర ఖాళీ లేదట. ఆ తేదీలను ఆమె ఇతర సినిమాలకు ఆల్రెడీ కేటాయించేశారట. దాని వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని టాక్. అయితే దీని గురించి కాజల్ స్పందించలేదు. చిత్ర యూనిట్ నుంచి కూడా అధికారిక సమాచారం ఏదీ రాలేదు. ఈ చిత్రాన్ని శంకర్ డైరక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com