వెబ్ సిరీస్‌లో మెరవనున్న చందమామ
- IndiaGlitz, [Tuesday,July 23 2019]
తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ ఉంటున్న కాజల్ అగర్వాల్ తమిళంలో 'కోమాలి', తెలుగులో 'రణరంగం' చిత్రాల్లో నటించింది. కాగా ఈ రెండు సినిమాలు ఆగస్ట్ 15నే విడుదల కానుండటం గమనార్హం. కాగా.. సినిమాలకు భిన్నమైన డిజిటల్ మాధ్యమంలోకి ఈ అమ్మడు ఎంట్రీ ఇవ్వనుందని టాక్. బాలీవుడ్, దక్షిణాది టాప్ స్టార్స్ ఇప్పుడు వెబ్ సిరీస్‌ల్లో నటించడానికి ఆసక్తిని చూపుతున్నారు. కాజల్ కూడా ఇప్పుడు వారి బాటలోకి అడుగు పెట్టనుంది. వివరాల్లోకెళ్తే.. దర్శకుడు వెంకట్ ప్రభు హాట్ స్టార్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ నటించనుందట. ఆగస్ట్‌లో ప్రారంభమయ్యే ఈ వెబ్ సిరీస్‌ను సెప్టెంబర్‌లో ముగించనున్నారు. 10 భాగాలుగా ఈ వెబ్‌సిరీస్‌ను ప్లాన్ చేశారట.