డాక్టర్ పాత్రలో కాజల్...
Send us your feedback to audioarticles@vaarta.com
పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ సొగసరి.. ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటూ సాగిపోతుంది. కాజల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో శర్వానంద్ మూవీ ఒకటి. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు షేడ్స్‌లో నటిస్తున్నాడు.
ఒకటి 1980-90 కాలానికి చెందిన పాత్ర కాగా.. మరో పాత్ర నేటి కాలానికి చెందిన గ్యాంగ్ స్టర్ పాత్ర. ఇందులో నేటి కాలానికి తగ్గ గ్యాంగ్‌స్టర్ తో ప్రేమలో పడే డాక్టర్ పాత్రలో కాజల్ అగర్వాల్ నటించబోతుంది. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ కూడా మరో హీరోయిన్గా నటిస్తుంది. ఈమె 1980-90 కాలానికి చెందిన శర్వానంద్ జోడిగా కనపడుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com