కాజల్ హ్యాట్రిక్ కొడుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన సినిమాల్లో సింహభాగం విజయం సాధించాయి. తమిళం, హిందీలోనూ సక్సెస్లను చవిచూసిందీ అమ్మడు. కేవలం హీరోయిన్ పాత్రల విషయంలో కాదు..అతిథి పాత్రల్లోనూ కనిపించి కాజల్ విజయాలు అందుకున్న సందర్భాలు లేకపోలేదు.
తమిళంలో ఈ ముద్దుగుమ్మ గెస్ట్ రోల్ లో సందడి చేసిన 'సరోజ'.. తెలుగులో అతిథి పాత్రలో మెరిసిన 'ఎవడు' చిత్రాలు హిట్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో.. అనుష్క 'సైజ్ జీరో' కోసం ముచ్చటగా మూడోసారి స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వనున్న కాజల్ కి అదే ఫలితం రిపీట్ అయి.. హ్యాట్రిక్ లభిస్తుందేమో చూడాలంటున్నారు పరిశీలకులు. 'సైజ్ జీరో' ఈ నెల 27న రిలీజ్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com