కాజల్ కి భలే కలిసొచ్చారుగా..

  • IndiaGlitz, [Saturday,August 12 2017]

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ్లాప్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ట‌ర్న్ అయిన ఓ టాలెంటెడ్ యాక్ట్ర‌స్‌. అయితే ఈ టాలీవుడ్ చంద‌మామ గ‌త కొంత కాలంగా రేస్‌లో కాస్త వెనుక‌బ‌డింది. గ‌తేడాది అయితే రెండు పెద్ద సినిమాలు (స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌, బ్రహ్మోత్స‌వం) ఆమె ఆశ‌ల‌కు గండి కొట్టాయి కూడా. ఇక కాజ‌ల్ ప‌ని అయిపోయింది అనుకున్న త‌రుణంలో మ‌ళ్లీ విజ‌యాల ప‌ట్టింది.
సంక్రాంతికి ఖైదీ నెం.150తో ఓ భారీ విజ‌యాన్ని చిరంజీవి కాంబినేష‌న్‌తో సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. తాజాగా విడుద‌లైన నేనే రాజు నేనే మంత్రితో మ‌రో హిట్‌ని త‌న సొంతం చేసుకుంది. ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ ఉన్నా.. త‌క్కువ బ‌డ్టెట్‌లో తీయ‌డం వ‌ల్ల లాభాల బాట ప‌ట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. అన్న‌ట్లు ఈ రెండు సినిమాల‌ను కూడా కాజ‌ల్‌తో ఆల్రెడీ ప‌నిచేసిన దర్శ‌కులే తీయ‌డం విశేషం. నాయ‌క్ త‌రువాత వి.వి.వినాయ‌క్ కాంబినేష‌న్‌లో ఖైదీ నెం.150 చేస్తే.. త‌న తొలి తెలుగు చిత్రం ల‌క్ష్మీ క‌ళ్యాణం త‌రువాత తేజ ద‌ర్శ‌క‌త్వంలో నేనే రాజు నేనే మంత్రి చేసింది కాజ‌ల్‌.

More News

ఈ నెల17న ఖమ్మంలో 'పైసా వసూల్' ఆడియో!

సినిమా ప్రారంభోత్సవం రోజున విడుదల తేదీ ప్రకటించడం ఇటీవల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్నదే.

తమిళంలోకి నాగ్ సినిమా...

తెలుగులో నాగార్జున ప్రధాన పాత్ర హథీరాంబాబాగా,సౌరభ్ జైన్ వేంకటేశ్వరునిగా నటించిన చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'.

వైభవ్ క్రేజీ ప్రాజెక్ట్ 'మెయాదా మాన్' తెలుగులో భారీగా విడుదలకు సన్నహాలు

సరోజ,యాక్షన్ త్రీడీ,అనామిక లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కథానాయకుడు వైభవ్.

రెండు వారాల గ్యాప్ తో.. రెండు సినిమాలు..

హిందీ సినిమాల మాటెలా ఉన్నా..టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి తెలుగు,తమిళ భాషల్లో మంచి క్రేజ్ నే ఉంది.

దసరా ఒకలా.. సంక్రాంతి మరోలా..

తెలుగువారికి ప్రీతికరమైన పర్వదినాలలో దసరా,సంక్రాంతికి ప్రత్యేక స్థానముంది.అలాగే సినిమా వారికి కూడా ఈ పండగల సమయం ప్రత్యేకం.