కాజల్ కు కోర్టులో చుక్కుదురు...
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు కోర్టులో చుక్కుదురైంది. గతంలో వీవీడి కొకొనెట్ అయిల్‌కు సంబంధించిన యాడ్‌లో కాజల్ అగర్వాల్. 2008 లో ఏడాదిపాటు ప్రసారం చేసేలా యాడ్‌ను ఒప్పుకుని కాజల్ అందులో నటించింది. అయితే మరుసటి ఏడాది కూడా ఈ యాడ్ ప్రసారం కావడంతో తన అనుమతి లేకుండా యాడ్‌ను పొడిగించారని కాజల్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది.
నిబంధనలు అతిక్రమించి యాడ్ ప్రసారం చేసినందుకు తనకు రూ. 2.50 కోట్ల నష్టపరిహారం చెల్లించేలా సంస్థను ఆదేశించాలని కాజల్ కోర్టును కోరారు. అయితే కేసును విచారించిన కోర్టు ఒక ప్రకటన దాన్ని రూపొందించిన సంస్థకే చెందుతుందని, ప్రకటనను ప్రసారం చేయాలనే హక్కు కాజల్‌కు లేదని, కమర్షియల్ యాడ్‌కు సంబంధించి ప్రమోషన్ హక్కులు సంస్థకు 60 సంవత్సరాలపాటు ఉంటాయని కోర్టు తెలియజేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout