షాకింగ్ న్యూస్ చెప్పి అభిమానుల సాయం కోరిన కాజల్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అభిమానులకు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఆమె ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. తనకు ఐదేళ్ల వయసున్నప్పుడే బ్రాంకైల్ ఆస్తమా ఉందని వెల్లడించింది. ఆ వయసులో ఒక చిన్నారికి ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ ఎదురైతే.. పాలు, చాకెట్ల నుంచి దూరమవ్వాల్సి వస్తే ఎలాంటి ఉంటుందో ఊహించుకోండి అంటూ కాజల్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ పెట్టింది.
‘‘నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు బ్రాంకియల్ ఆస్తమా ఉందని తెలిసింది. నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే.. నేను ఆ వయసులోనే డైట్ విషయంలో చాలా ఆంక్షలను ఎదుర్కొన్నాను. పాలు, చాక్లెట్ల నుంచి ఒక చిన్నారి దూరంగా ఉండాల్సి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కానీ నాకు పెద్దయ్యాక అది అంత ఈజీ కాలేదు. ప్రతి శీతాకాలంలోనూ, దుమ్ము ధూళిలోకి వెళ్లిన ప్రతిసారీ బ్రాంకియల్ ఆస్తమా లక్షణాలు మరింత పెరిగేవి. ఆ పరిస్థితుల నుంచి బయట పడటానికి ఇన్హేలర్స్ ఉపయోగించడం ప్రాంభించా. వెంటనే తాత్కాలిక ఉపశమనం కలిగేది. ఆ మార్పును నేను గమనించా.
అందువల్ల, ఎప్పుడూ నావెంట ఓ ఇన్హేలర్ తప్పకుండా ఉండేలా చూసుకుంటా. మన దేశంలో చాలామందికి ఇన్‌హెలర్స్ అవసరం. అయితే, సామాజిక కళంకంగా భావించి దానిని ఎవరూ వినియోగించుకునేందుక పెద్దగా ఇష్టపడరు. పబ్లిక్‌గా అయినా... ప్రైవేట్‌గా అయినా... ఇన్‌హెలర్స్ ఉపయోగించడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిద్దాం. సే ఎస్ టు ఇన్‌హెలర్స్. ఈ ఆస్తమాతో పాటు ఇన్హేలర్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నా ఫ్రెండ్స్, ఫాలోయర్స్, ఫ్యామిలీ నాతో జాయిన్ అవ్వండి’’ అంటూ కాజల్ తన ఇన్‌స్టా ద్వారా అభిమానుల సాయం కోరింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments