ఖైదీ నెం 150 లో కాజల్, సుస్మితాల సందడి..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం స్లోవేనియా, క్రొయేషియాలో పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఈ సందర్భంగా ఈ మూవీ షూటింగ్ స్పాట్ లో సందడి చేసిన ఫోటోలను కాస్టూమ్స్ డిజైనర్ & చిరు డాటర్ సుస్మిత, హీరోయిన్ కాజల్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. ఇక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంది. ఈ పాటలను చిత్రీకరించడానికి ఇంత కంటే మంచి ప్లేస్ ఉండదు అంటూ సుస్మిత ట్వీట్ చేసారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ భారీ చిత్రానికి యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఖైదీ నెం 150 చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments