కాజల్ తోనైనా లెక్క మారుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
ట్రెండ్ సెట్టింగ్ సినిమాతో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన ఘనత ఆయనది. ఆ తరువాత కూడా రెండు సంచలన విజయాలను నమోదు చేసుకున్నప్పటికీ వరుస పరాజయాలు అతని హవాకి బ్రేక్ వేశాయి. పూర్వ వైభవం కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న అతను మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఆ సినిమా అయినా అతనికి మునుపటి హవా తీసుకువస్తుందేమో చూడాలంటోంది టాలీవుడ్.
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే.. తేజ. 'చిత్రం'తో డైరెక్టర్ గా టర్న్ అయిన ఈ ఒకనాటి టాలెంటెడ్ కెమెరామేన్ 'నువ్వునేను', 'జయం' చిత్రాలతో సంచలన విజయాలు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత వరుస పరాజయాలతో ఉన్న తేజ ప్రస్తుతం రానా, కాజల్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఉన్న కాజల్.. తన తొలి తెలుగు చిత్రాన్ని తేజ డైరెక్షన్ లోనే చేసిన సంగతి తెలిసిందే.
'లక్ష్మీ కళ్యాణం' పేరుతో తేజ రూపొందించిన ఆ సినిమా ఫ్లాప్ అయినా.. కాజల్ కి నటిగా మంచి మార్కులే తీసుకొచ్చింది. మళ్లీ తొమ్మిదేళ్ల తరువాత తేజ దర్శకత్వంలో కాజల్ నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే.. తేజ తన హీరోయిన్లతో చేసిన రెండో సినిమాలన్నీ పరాజయాలే.
'నువ్వునేను' తరువాత అనితతో చేసిన 'యే దిల్' (హిందీ 'నువ్వునేను' ) .. 'జయం' తరువాత సదాతో చేసిన 'ఔనన్నా.. కాదన్నా' చిత్రాలు తేజని నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో కాజల్‌తో చేస్తున్న సినిమా అయినా హిట్ అవుతుందేమో చూడాలి. కొసమెరుపు ఏమిటంటే.. తనకు కలిసొచ్చిన హీరోయిన్లతో విజయాలు అందుకోలేకపోయిన తేజ.. కలిసి రాని హీరోయిన్‌తో అయినా హిట్ కొడతాడేమో చూడాలి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com