కాజల్ తోనైనా లెక్క మారుతుందా?

  • IndiaGlitz, [Wednesday,May 11 2016]

ట్రెండ్ సెట్టింగ్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన ఘ‌న‌త ఆయ‌న‌ది. ఆ త‌రువాత కూడా రెండు సంచ‌ల‌న విజ‌యాల‌ను న‌మోదు చేసుకున్న‌ప్ప‌టికీ వ‌రుస ప‌రాజ‌యాలు అత‌ని హ‌వాకి బ్రేక్ వేశాయి. పూర్వ వైభ‌వం కోసం కొన్నాళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్న అత‌ను మ‌రో చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. ఆ సినిమా అయినా అత‌నికి మునుప‌టి హ‌వా తీసుకువ‌స్తుందేమో చూడాలంటోంది టాలీవుడ్‌.

ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే.. తేజ‌. 'చిత్రం'తో డైరెక్ట‌ర్ గా ట‌ర్న్ అయిన ఈ ఒక‌నాటి టాలెంటెడ్ కెమెరామేన్ 'నువ్వునేను', 'జ‌యం' చిత్రాల‌తో సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత వ‌రుస ప‌రాజ‌యాల‌తో ఉన్న తేజ ప్ర‌స్తుతం రానా, కాజ‌ల్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్ గా ఉన్న కాజ‌ల్.. త‌న తొలి తెలుగు చిత్రాన్ని తేజ డైరెక్ష‌న్ లోనే చేసిన సంగ‌తి తెలిసిందే.

'ల‌క్ష్మీ క‌ళ్యాణం' పేరుతో తేజ రూపొందించిన ఆ సినిమా ఫ్లాప్ అయినా.. కాజ‌ల్ కి న‌టిగా మంచి మార్కులే తీసుకొచ్చింది. మ‌ళ్లీ తొమ్మిదేళ్ల త‌రువాత తేజ ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్ న‌టిస్తున్న సినిమా ఇదే కావ‌డం విశేషం. ఇక్క‌డ గ‌మ‌నించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. తేజ త‌న హీరోయిన్ల‌తో చేసిన రెండో సినిమాల‌న్నీ ప‌రాజ‌యాలే.

'నువ్వునేను' త‌రువాత అనిత‌తో చేసిన 'యే దిల్' (హిందీ 'నువ్వునేను' ) .. 'జ‌యం' త‌రువాత స‌దాతో చేసిన 'ఔన‌న్నా.. కాద‌న్నా' చిత్రాలు తేజ‌ని నిరాశ‌ప‌రిచాయి. ఈ నేప‌థ్యంలో కాజ‌ల్‌తో చేస్తున్న సినిమా అయినా హిట్ అవుతుందేమో చూడాలి. కొస‌మెరుపు ఏమిటంటే.. త‌న‌కు క‌లిసొచ్చిన హీరోయిన్ల‌తో విజ‌యాలు అందుకోలేక‌పోయిన తేజ‌.. క‌లిసి రాని హీరోయిన్‌తో అయినా హిట్ కొడ‌తాడేమో చూడాలి

More News

నవీన్ చంద్ర 'చందమామ రావే'

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యి యూత్ హర్ట్ ని దొచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రానికి చందమామ రావే అనే టైటిల్ ని ఖరారు చేశారు.

'ప్రేమమ్ ' కి అదో ప్లస్

మలయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్'..తెలుగులో అదే పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్,అనుపమ పరమేశ్వరన్,మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

బన్ని బ్రదర్ సినిమా..సెంటిమెంట్ అధిగమిస్తుందా?

సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు అల్లు అర్జున్ . 'సరైనోడు'తో సాలిడ్ హిట్ ని సొంతం చేసుకున్న బన్ని..ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదించే పనిలో ఉన్నాడు.

త్రివిక్రమ్ ఆమెకి స్కోప్ ఇచ్చాడా?

త్రివిక్రమ్ తన పాత శైలికి వెళ్లి రూపొందించిన చిత్రం 'అ..ఆ..'నితిన్,సమంత,అనుపమ పరమేశ్వరన్,నదియా..ఇలా భారీ తారగణమే ఈ చిత్రంలో నటించింది.

పవన్ 'గబ్బర్ సింగ్ ' కి 4 ఏళ్లు

'నాక్కొంచెం తిక్కుంది..కానీ దానికో లెక్కుంది','నేను ట్రెండ్ ని ఫాలో కాను..ట్రెండ్ ని సెట్ చేస్తా'..