మేడ‌మ్ టుస్సాడ్స్‌లో కాజ‌ల్ విగ్ర‌హం

  • IndiaGlitz, [Tuesday,December 17 2019]

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కి అరుదైన గౌర‌వం ద‌క్కుతుంది. ఇంత‌కు ఆమెకు ద‌క్కుతున్న గౌర‌వ‌మేమిటంటే.. సింగ‌పూర్‌లోని మేడ‌మ్ టుస్సాడ్స్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ మైన‌పు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్క‌డి నుండి వ‌చ్చిన ప్ర‌తినిధులు కాజ‌ల్ విగ్రహానికి సంబంధించిన కొల‌త‌ల‌ను తీసుకున్నారు. ఈ విష‌యాన్ని కాజ‌ల్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ జుట్టు, శ‌రీరం, క‌ళ్ల రంగుతో పాటు, ముఖం కొల‌త‌ల‌ను తీసుకున్నారు.

''ఫిబ్ర‌వ‌రి 5 సింగ‌పూర్ మేడ‌మ్ టుస్సాడ్స్‌లో నా మైన‌పు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. టుస్సాడ్ మ్యూజియంకి వెళ్లి అక్క‌డి విగ్ర‌హాల‌ను చూసి ఆనందప‌డేదాన్ని. ఇప్పుడు వాటి ప‌క్కన నా విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నుండ‌టం ఆనందంగా ఉంది. గౌర‌వంగా భావిస్తున్నాను. క‌ష్టానికి, వ్య‌క్తిగ‌త త్యాగానికి మంచి గుర్తింపు ల‌భిస్తుంది. ఇన్నేళ్లు మ‌ద్దతు ఇచ్చినంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు'' అన్నారు.

ప్ర‌స్తుతం కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఇండియ‌న్ 2లో న‌టిస్తుంది. మ‌రో ప‌క్క ఈమె న‌టించిన క్వీన్ రీమేక్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

More News

జగన్ రాజధానుల ప్రకటనపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా!

ఆంధ్రప్రదేశ్‌‌లో బహుశా మూడు రాజధానులు రావొచ్చని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎవరూ ఊహించని రీతిలో సంచలన ప్రకటన చేశారు.

అమితాబ్ 3 స‌ల‌హాల్లో 1 దాన్ని పాటించ‌లేక‌పోతున్నాను: ర‌జినీకాంత్‌

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ద‌ర్బార్‌`.

జగన్ ఊహించని ప్రకటన: ఏపీలో మూడు రాజధానులు

వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతి పరిస్థితేంటి..?

భూమలు ‘బాంబ్’ పేల్చిన బుగ్గన.. టీడీపీలో కలవరం!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, ఉపాధి హామీ నిధులతో పాటు అతి ముఖ్యమైన నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై హాట్ హాట్‌గా చర్చ జరిగింది.

ఇన్‌స్టాగ్రామ్ ‘క్యాప్షన్‌ వార్నింగ్..’ తస్మాత్ జాగ్రత్త!

టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతోంది.. దాన్ని పనికొచ్చే పనులకు వాడుకోవాల్సింది పోయి.. కొందరు అనవసర పనులకు వాడేస్తున్నారు.