విక్టరీ తో జతకడుతున్న కాజల్...

  • IndiaGlitz, [Monday,February 29 2016]
విక్ట‌రీ వెంక‌టేష్‌...ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో బాబు...బంగారం సినిమాలో న‌టిస్తున్నారు. సూర్య‌దేవ‌ర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రూపొందుతున్న‌ ఈ సినిమా జులై 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే...నేను...శైల‌జ సినిమాతో స‌క్సెస్ సాధించిన డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌లతో వెంకీ ఓ మూవీ చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని మ‌ల్టీ డైమ‌న్ష‌న్ సంస్థ నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తుంది. ఈ చిత్రంలో వెంక‌టేష్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌హేష్ తో బ్ర‌హ్మోత్స‌వం, ప‌వ‌న్ తో స‌ర్ధార్ చిత్రాల్లో న‌టిస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ సీనియ‌ర్ హీరో వెంకీ స‌ర‌స‌న న‌టిస్తుండ‌డం విశేషం. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నారు.