‘ఆచార్య’ నుంచి కాజల్ కూడా ఔట్.. ఇందుకేనా!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. కరోనా లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది కానీ.. ఇప్పటికే సుమారు 70 శాతం షూటింగ్ అయిపోయేది. అయితే.. ఇప్పటి వరకూ చిరు సరసన కథానాయిక ఎవరనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొనగా.. అనుష్క, కాజల్, నయనతార, త్రిష ఇలా చాలా మంది పేర్లు పరిశీలించడం జరిగింది. అయితే ఫైనల్‌గా త్రిషనే తీసుకున్నారు. ఈ కాంబో అనగానే మెగాభిమానుల్లో సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం, ఆనందం అంతే రీతిలో ఆవిరైపోయింది. తాను ఈ చిత్రంలో చేయట్లేదని.. వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ వేదికగా సడన్ షాకిచ్చింది.
కాజల్ కూడా ఔట్!
ఆ తర్వాత త్రిష స్థానంలో కాజల్‌ను తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావించారు. అధికారిక ప్రకటన రాలేదు కానీ.. సూచయగా కాజలే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకుంది కూడా. చిరు సరసన ఖైదీ నంబర్-150లో కాజల్ నటించి మెప్పించింది. అంటే ఇదే కాంబోలో రెండో సినిమా అని కచ్చితంగా వర్కవుట్ అవుతుందని అందరూ భావించారు. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే లాక్డౌన్ తర్వాత షూటింగ్లో కాజల్ కూడా పాల్గొనేది. కానీ.. తాజాగా కాజల్ కూడా తప్పుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు తెలియట్లేదు కానీ పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. కరోనాకు ముందు అడిగిన పారితోషికానికి.. తర్వాత పారితోషికానికి చాలా తేడా ఉందని అందుకే తప్పుకుంటున్నట్లు తెలియవచ్చింది.
త్రిష అలా.. కాజల్ ఇలా..!
కాగా చిరు సినిమా నుంచి తప్పుకున్న త్రిష.. మాస్ మహారాజ్ రవితేజ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడిచింది. దీంతో ఆమెపై మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక కాజల్ విషయానికొస్తే.. ‘ఆచార్య’ నుంచి తప్పుకున్నాక ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ జోడీగా చేయడానికి పచ్చజెండా ఊపిందని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి బల్క్‌గా డేట్స్ కూడా ఇచ్చేసిందట. భారీగా పారితోషికం ఇస్తుండటం.. పాత్ర కూడా మంచిగా ఉండటంతో కాజల్ ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఆచార్య’లో అంతగా ప్రాధాన్యం లేని పాత్ర అని ఉదయనిధి స్టాలిన్ సినిమాలో మాత్రం కీలక పాత్ర కావడం కూడా ఓ కారణమని తెలుస్తోంది.
వాట్ నెక్స్ట్!
మొత్తానికి చూస్తే.. ‘ఆచార్య’ యూనిట్‌కు వరుస షాక్‌లు తగుతులున్నాయ్. త్రిష తప్పుకోవడం, కరోనా రావడం, ఇప్పుడు కాజల్ తప్పుకోవడం ఇలా వరుస పరిణామాలు చూస్తుంటే కాసింత అసంతృప్తి అనేది ఉంటుంది. మరి ఇదే నిజమైతే కాజల్ స్థానంలో ఎవర్ని తీసుకుంటారో ఏంటో..! ఇందులో నిజానిజాలు తెలియాలంటే కాజల్ నుంచి కానీ.. ‘ఆచార్య’ యూనిట్ నుంచి కానీ అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com