ఇద్దరు బిడ్డల తల్లిగా కాజల్?
Send us your feedback to audioarticles@vaarta.com
కాజల్ అగర్వాల్.. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లోనూ ఆకట్టుకున్న కథానాయిక పేరిది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా రాణించిన కాజల్.. హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది. అయితే.. పదేళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకున్నా.. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు బిడ్డల తల్లిగా కనిపించిన సందర్భం లేదనే చెప్పాలి. త్వరలో ఆ ముచ్చటా తీరేలా ఉంది. అన్ని అనుకున్నట్లుగా కుదిరితే.. తనని తెలుగు తెరకి పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో కాజల్ ఇలా బిడ్డల తల్లిగా కనిపించే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాస్త వివరాల్లోకి వెళితే.. వెంకటేష్ కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో వెంకీ.. మిడిల్ ఏజ్డ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇద్దరు బిడ్డల తండ్రిగా కనిపించనున్న ఆయన పాత్రకి జోడీగా కాజల్ నటించే అవకాశముందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఆటా నాదే వేటా నాదే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతమందించనున్నారు. కాగా, ఈ సినిమా కోసం కాజల్ కోటి రూపాయిల పారితోషికం డిమాండ్ చేస్తోందని సమాచారం. త్వరలోనే కాజల్ ఎంపికపై క్లారిటీ వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com