కాజల్.. మూడో హ్యాట్రిక్

  • IndiaGlitz, [Monday,February 26 2018]

లక్ష్మీక‌ళ్యాణం'(2007)తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది భామ‌ కాజ‌ల్ అగ‌ర్వాల్. ద‌శాబ్ద‌కాలంగా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ‌ న‌టించిన తాజా చిత్రం అ!'. ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీలో కాజ‌ల్ పోషించిన పాత్రే కీల‌కం. ఈ సినిమా విడుద‌లై వారం పూర్త‌య్యింది. ఈ సినిమా ఇప్ప‌టికే కొన్ని చోట్ల లాభాల‌తో దూసుకుపోతూ.. న‌టించిన న‌టీన‌టుల‌తో పాటు ద‌ర్శ‌కనిర్మాత‌లు కూడా ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ఇదిలా వుంటే.. ఈ సినిమాతో కాజ‌ల్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. అదేమిటంటే.. ఖైదీ నంబ‌ర్ 150', నేనే రాజు నేనే మంత్రి', అ!'

.. ఇలా వ‌రుస‌గా హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు కాజ‌ల్‌. అయితే.. ఈ ఘ‌న‌త‌ను ఇంత‌కుముందు కూడా సాధించారు కాజ‌ల్. 2010-11లో వ‌చ్చిన డార్లింగ్', బృందావ‌నం', మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్' సినిమాల‌తో మొద‌టిసారి ఈ ఫీట్ ను అందుకున్న ఈ టాలీవుడ్ చంద‌మామ‌.. ఆ త‌ర్వాత 2013-14లో నాయ‌క్', బాద్షా', ఎవ‌డు' మూవీల‌తో రెండోసారి కూడా ఈ ఘ‌న‌త‌ను సాధించారు. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి అందుకున్న ఈ ఫీట్‌తో క‌లిపి హ్యాట్రిక్ విజ‌యాల విష‌యంలో హ్యాట్రిక్‌ అందుకున్న క‌థానాయిక‌గా ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కించుకున్నారు కాజ‌ల్‌.

More News

రెండో స్థానంలో చేరిన తమన్

యువ సంగీత సంచలనం తమన్..మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు.

శ్రీదేవిగారి కుటుంబంతో నా అనుబంధం మరువలేనిది - ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం

శ్రీదేవిగారితో నా అనుబంధం ఈనాటిది కాదు.నా సూపర్ హిట్ సినిమాల్లో ఎక్కువగా హిందీలో రీమేక్ చేసింది బోణీ కపూర్ గారే.

శ్రీదేవి చనిపోలేదు.. ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటుంది - చిరంజీవి

శ్రీదేవి గురించి ఇలాంటి ఒక సందర్భం వస్తుందని అనుకోలేదు.ఆమె గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని నిజంగా నేనెప్పుడూ ఊహించలేదు.

అతిలోక సుందరి శ్రీదేవి కన్నుమూత

తనదైన అద్భుత నటనతో సినీ వినీలాకాశాన్ని ఏలిన నటి శ్రీదేవి(54)హఠాన్మరణం చెందారు.

నాటి 'శ్రీనివాస కళ్యాణం' బాటలోనే..

విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మరపురాని చిత్రాలలో ‘శ్రీనివాస కళ్యాణం’(1987)ఒకటి.