కాజల్.. మూడో హ్యాట్రిక్
Send us your feedback to audioarticles@vaarta.com
లక్ష్మీకళ్యాణం`(2007)తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఉత్తరాది భామ కాజల్ అగర్వాల్. దశాబ్దకాలంగా తన నటనతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం అ!`. ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీలో కాజల్ పోషించిన పాత్రే కీలకం. ఈ సినిమా విడుదలై వారం పూర్తయ్యింది. ఈ సినిమా ఇప్పటికే కొన్ని చోట్ల లాభాలతో దూసుకుపోతూ.. నటించిన నటీనటులతో పాటు దర్శకనిర్మాతలు కూడా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదిలా వుంటే.. ఈ సినిమాతో కాజల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. అదేమిటంటే.. ఖైదీ నంబర్ 150`, నేనే రాజు నేనే మంత్రి`, అ!`
.. ఇలా వరుసగా హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు కాజల్. అయితే.. ఈ ఘనతను ఇంతకుముందు కూడా సాధించారు కాజల్. 2010-11లో వచ్చిన డార్లింగ్`, బృందావనం`, మిస్టర్ పర్ఫెక్ట్` సినిమాలతో మొదటిసారి ఈ ఫీట్ ను అందుకున్న ఈ టాలీవుడ్ చందమామ.. ఆ తర్వాత 2013-14లో నాయక్`, బాద్షా`, ఎవడు` మూవీలతో రెండోసారి కూడా ఈ ఘనతను సాధించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అందుకున్న ఈ ఫీట్‌తో కలిపి హ్యాట్రిక్ విజయాల విషయంలో హ్యాట్రిక్ అందుకున్న కథానాయికగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు కాజల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments