గర్భవతిగా.. పుట్టబోయే బిడ్డ కోసం కాజల్ వ్యాయామాలు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారానికి ఇటీవల కాజల్ దంపతులు తెరదించారు. కాజల్ గర్భవతి అంటూ ఆమె భర్త గౌతమ్ కిచ్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గౌతమ్.. '2022.. నిన్నే చూస్తున్నా..' అంటూ ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని ఎటాచ్ చేశారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు కాజల్-గౌతమ్ లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
మరోవైపు పుట్టబోయే బిడ్డ కోసం కాజల్ అగర్వాల్ కొత్త జర్నీ ప్రారంభించారు. గర్భం దాల్చిన మహిళలు చేసే వ్యాయామాలు చేయడం స్టార్ట్ చేశారు. "prenatal journey ( గర్భం దాల్చిన సమయంలో మహిళలు తీసుకునే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు) చేయడం సంతోషంగా ఉంది" అని కాజల్ తెలిపారరు.
తెలుగుతో పాటు దక్షిణాదిలోని అగ్రహీరోలందరితో నటించిన కాజల్.. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత సినిమాలకు స్వస్తి చెప్పకుండా.. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే కొన్ని ప్రాజెక్ట్స్‌లో నటించారు కాజల్. టాలీవుడ్ అగ్రకథానాయకుడు చిరంజీవితో ఆమె నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘‘ఉమ’’ అనే బాలీవుడ్ సినిమాలోనూ నటించింది. ఈ మూవీ విడుదలకు సన్నద్ధమవుతుంది. ఇందులో తానొక మిస్టీరియస్ అమ్మాయి పాత్రలో కనిపిస్తానని అభిమానులకు కాజల్ తెలియజేశారు.
అయితే తమిళ దర్శక దిగ్గజం శంకర్- విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘‘ఇండియన్ 2’’లోనూ కాజల్ ఛాన్స్ దక్కించుకుంది. అయితే అనుకోని కారణాల వల్ల ఇప్పుడా ప్రాజెక్ట్ ఆగింది. అలాగే నాగార్జున- ప్రవీణ్ సత్తారు కలయికలో రూపొందుతున్న ‘‘ది ఘోస్ట్’’లోనూ కాజలే హీరోయిన్. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ఫిలింనగర్ టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments